‘కొండా’ సేవలు మరువలేం | Konda Lakshman services not forgetful | Sakshi
Sakshi News home page

‘కొండా’ సేవలు మరువలేం

Published Sun, Sep 29 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Konda Lakshman services not forgetful

సాక్షి, ముంబై: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేమంటూ పలువురు వక్తలు ప్రశంసించారు. ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతి వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం లోయర్ పరేల్‌లోని ఆర్యసమాజ్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంఘ ప్రతినిధులతోపాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ప్రధాన కార్యదర్శి యెల్ది సుదర్శన్ ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షుడు శైవ రాములు లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను వివరించారు.
 
 పోతు రాజారాం, యాపురం వెంకటేశ్, వాసాల శ్రీహరి, మంతెన రమేశ్, బుదారపు రాజారాం, నోముల నారాయణ, కోడి చంద్రమౌళి తదితరులు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బోగ సహదేవ్, మచ్చ ప్రభాకర్, సంకు సుధాకర్,తిరందాస్ సత్యనారాయణ, యెల్లప్ప, బడుగు విశ్వనాథ్, కలుకం విజయ, నీత, చిలువేరి విజయ, మచ్చ సుజాత,  కొమరం భీమ్ స్మారక సంస్థ అధ్యక్షుడు రుద్ర శంకర్ (హైదరాబాద్) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement