ఎల్ఈడీ వెలుగులు | LED lights in gadwal municipality | Sakshi
Sakshi News home page

ఎల్ఈడీ వెలుగులు

Published Wed, Oct 19 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

ఎల్ఈడీ వెలుగులు

ఎల్ఈడీ వెలుగులు

గద్వాల మున్సిపాలిటీలో విద్యుత్‌ ఆదాకు ప్రభుత్వం శ్రీకారం
మరిన్ని ఎల్‌ఈడీ విద్యుత్‌దీపాల ఏర్పాటు
పట్టణానికి తగ్గనున్న అధికబిల్లుల భారం
మున్సిపల్‌ మంత్రి నిర్ణయంతో ఆశలు ఉపశమనం
 
గద్వాల: జిల్లాకేంద్రం మున్సిపాలిటీలో తడిసిమోపెడవుతున్న విద్యుత్‌ బిల్లుల భారం ఇక తగ్గనుంది. విద్యుత్‌ ఆదా కోసం ఎల్‌ఈడీ వెలుగులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్‌ వెలుగులు ఏర్పాటుచేయాలని మొదట భావించినా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ పరిధిలో విద్యు™Œ  పొదుపుమంత్రం పాటించేలా చర్యలు చేపట్టనుంది. పట్టణాల్లో ప్రతివీధిలో ఎల్‌ఈడీ వెలుగు అందించాలనే లక్ష్యాన్ని పక్కాగా అమలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారయంత్రాంగం భావిస్తోంది. 
 
ఇదీ పరిస్థితి గద్వాల పట్టణంలో సుమారు ఐదువేల వీధిదీపాలు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం 3,667లైట్లు వెలుగుతున్నాయి. వీటితో పాటు ప్రధానకూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు, రోడ్ల మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాౖటెంది. దీనికోసం విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు అధిక లోఓలే్టజీ మెర్క్యూరీ దీపాలు వాడుతున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఫలితంగా సుమారు రూ.30లక్షల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. అసలే ఖజానా నిండుకుని కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉండగా, వెలుగుల భారం మోయలేనిస్థితిలో ఉంది. గద్వాల ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వీధిదీపాలు వెలుగుతున్నాయి. వేకువజామునే ప్రధాన కూడళ్లతో పాటు అంతర్గత కాలనీల్లోని  స్తంభాలకు లైట్లకు విద్యుత్‌ సర ఫరా నిలిపివేయడం లేదు. ఉదయం 10గంటల వరకు స్విచ్‌లు ఆఫ్‌చేయడం లేదు. విద్యుత్‌ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యుత్‌ వినియోగం పెరిగి ఖజానాకు చిల్లులు తప్పడం లేదు. 
 
బిల్లుల భారంతో ఇక్కట్లు 
గతంలో మున్సిపాలిటీలకు ప్రత్యేకనిధులు మంజూరవుతుండగా.. ఇప్పుడా పరిస్థితిలేదు. సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నామని మెలికపెట్టి నిధుల్లో కోతపెట్టారు. నాలుగేళ్లుగా నయాపైసా విడుదల కాలేదు. దీంతో విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇదిలాఉండగా, విద్యుత్‌ వినియోగంలో పొదుపు మంత్రం పాటించకపోవడంతో వెలుగుల భారం పెరిగిపోతుంది. గద్వాల మున్సిపాలిటీలో సుమారు రూ.మూడుకోట్ల బిల్లుల బకాయిలు పేరుకుపోతుండగా.. వాటిని విడతల వారీగా చెల్లిస్తున్నారు. 
 
ఆదాయం మిగులుతుంది
ఎల్‌ఈడీ వెలుగులతో మున్సిపాలిటీలకు ఆదాయం మిగులుతుంది. విద్యుత్‌బిల్లుల ఖర్చు తక్కువగా వస్తుంది. ఈ చర్యతో ఆర్థికకష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుంటుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌ దీపాలతో కరెంట్‌ బిల్లు లు భారీగా వస్తున్నాయి. విద్యుత్‌ ఆదాకు ఎల్‌ఈడీ వెలుగులు ఉపకరిస్తాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.. 
-గోపయ్య, గద్వాల మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ 
 
రాష్ట్రంలో హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థతో పాటు నగర, పట్టణవీధుల్లో విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేయాలి. విద్యుత్‌ఆదాతో పాటు మున్సిపాలిటీలకు ఆదాయం మిగులుతుంది.
ఇటీవల మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement