మహబూబ్నగర్ : మానవపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వాహనం కింద పడిన మృతదేహం కంటైనర్ చక్రలలో చిక్కుకుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు మృతదేహాన్ని కంటైనర్ డ్రైవర్ అలాగే తీసుకెళ్లాడు.
పుల్లూరు టోల్గేట్ వద్ద కంటైనర్ ఆపడంతో మృతదేహం కింద పడింది. టోల్గేట్ సిబ్బంది వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంటైనర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.