మారథాన్‌కు విశేష స్పందన
Published Mon, Jan 6 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:మెదడువాపు సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం నాథెల్లా జ్యువెలరీస్, డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 సంయుక్తంగా ఆదివారం ఉదయం చేపట్టిన డౌన్ టు డస్క్ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని చెన్నై గిండీలోని ఐఐటీ- మద్రాసు ఆవరణలో ప్రముఖ సినీ నటులు, డౌన్ టు డస్క్ బ్రాండ్ అంబాసిడర్‌లైన కార్తీ, అరవింద్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో రన్ మారథాన్, సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఉదయం 8.30 గంటల రన్ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించిన సైకిల్ మారథాన్ చెన్నై ఐఐటీ - మద్రాసు నుంచి మహాబలిపురం వరకు సాగింది. దీనిని చెన్నై, పోలీసు జాయింట్ కమిషనర్ రాజేష్ దాస్, టీపీఎస్ డెరైక్టర్ శ్రీనాథ్ రాజెం జెండా ఊపి ప్రారంభించారు. రన్ మారథాన్‌లో, సైకిల్ మారథాన్‌లో 6,300 మంది పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేశారు. డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 నిర్వాహకులు మాట్లాడుతూ బాల సంజీవని సిరెబ్రల్ పల్సీ రెహబ్ సెంటర్‌లోని మెదడు సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు థెరపీ సౌకర్యార్థం మారథాన్‌లో వచ్చిన మొత్తాన్ని విరాళంగా అందించనున్నామన్నారు. పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేయడం సంతోషంగా ఉందని, వారం దరికీ అభినందనలు తెలిపారు.
Advertisement