విమానాశ్రయాల అనుమతిపై రేపు ఢిల్లీలో భేటీ
Published Sun, Sep 25 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
హైదరాబాద్: విమానాశ్రయాల అనుమతులపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ సోమవారం ఢిల్లీలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర మౌలిక వసతుల కల్పనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఈ సమావేశానికి హాజరవుతారు.
భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనుమతులు మంజూరైన తర్వాత విమానాశ్రయాల పనులను వేగంతం చేస్తామని అజయ్‌జైన్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారని, కొత్త ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement