మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త. వీరికిస్తున్న పింఛన్‌ను రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు పెంచాలని విధానసభ వర్షాకాల ముగింపు సమావేశం రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు మాజీ పార్లమెంట్ సభ్యుల కంటే ఎక్కువ పింఛన్ లభించనుంది. ఈ నిర్ణయంవల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ.30 కోట్ల భారం పడనుంది. ఇటీవల ముగిసిన వర్షాకాల విధానసభ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో మాజీ ఎమ్మెల్యేల పింఛన్ పెంపు బిల్లు ఆఖరు రోజున చర్చకు వచ్చింది. అయితే ఎటువంటి చర్చలు జరపకుండానే ఆమోదం లభించింది.
పెరిగిన నిత్యావసర సరకుల ధరతో పోలిస్తే మాజీలకు చెల్లించే పింఛన్ మొత్తం సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. సంసారాన్ని నెట్టుకురావడమే కష్టతరంగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా మాజీ ఎంపీలకు నెలకు రూ.20 వేల పింఛన్ వస్తుండగా, ఐదు సంవత్సరాలు పూర్తయిన మాజీ ఎమ్మెల్యేలకు ఇకనుంచి నెలకు రూ.25 వేలు పింఛన్ కింద లభించనుంది. ఒకసారికంటే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా పనిచేస్తే పెన్షన్‌లో ప్రతి సంవత్సరం రూ. రెండు వేల చొప్పున అదనంగా లభిస్తుంది. దివంగత ఎమ్మెల్యేల వారసులు లేదా వారి బంధువులకు కూడా పింఛన్ లభిస్తుంది. కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు చెల్లిస్తున్న పింఛన్ మొత్తం ఎక్కువేనని ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా తమకు పింఛన్ మొత్తం పెంచాలంటూ 2011 నుంచి మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అయితే గత ఏడాది రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వాయిదావేసింది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన విధానసభ వర్షాకాల సమావేశంలో ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మాజీల పంటపండింది. అయితే 2011 నుంచి పెంపు పెన్షన్ చెల్లించాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిర్ణయానికి గత గురువారమే ఆమోదం తెలిపినప్పటికీ ఆర్థిక శాఖ మాత్రం వ్యతిరేంచింది. అయితే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించినట్లు తెలిసింది.
మాజీ ఎమ్మెల్యేల పింఛన్ ఇకనుంచి రూ. 40 వేలు
Published Tue, Aug 6 2013 10:49 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement