'కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్'
శ్రీకాళహస్తి: కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మూయించేసాడని మండిపడ్డారు.
ఇప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ కేంద్రానికి కరువు నివేదిక ఇవ్వలేదని అన్నారు. దీనిబట్టే రైతులంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో అర్ధమవుతోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.