సాక్షి, తిరుపతి : సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని నారా లోకేష్‌ను మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఫీజ్ రియింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన 3900 కోట్లు చెల్లించలేదు, విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడెస్తున్నారు చంద్రబాబు,ఆయన ప్రభుత్వం. విద్యా దీవెన 2800 కోట్లు, వసతి దివెన 1100 కోట్లు బకాయిలు చెల్లించలేదు. విద్య తోనే భవిష్యత్తు అభివృద్ధి. పేద విద్యార్థుల విద్యకు దూరం చేస్తున్నారు.దీనిపై మంత్రులు వితండంగా మాట్లాడుతారు.చంద్రబాబు దిగిపోయేనాటి రూ.2800 కోట్లు బకాయిలు వైఎస్ జగన్ చెల్లించుకుంటూ వచ్చారు. పెదవాళ్లంటే చంద్రబాబుకు చిరాకు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రియంబర్సమెంట్‌కు తూట్లు పొడుస్తున్నారు. ఏడు నెలల్లో చేయూత, అమ్మవడి, నాడు నేడు , ఆరోగ్యశ్రీ,, వాలంటీర్ వ్యవస్థలంటికి మంగళం పాడారు. జగన్‌పై విమర్శలు చెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. సూపర్ సిక్స్ అమలు చెయ్యకుంటే కాలర్ పట్టుకోమన్నారు నారా లోకేష్. ఏ కాలర్ పట్టుకోవాలి ఇప్పుడు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఎన్నికలకు ముందు తెలియదా ఇదంతా. బటన్ నొక్కడం పెద్ద విషయమా అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హామీలు అమలు చెయ్యడం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఇచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యారు. ఎందుకు నిలదియడంలేదు. నేను, నా కుమారుడు అధికారంలోకి వచ్చామ్ చాలు అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రవర్తన. బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు.
కూటమి ఓటు వేస్తే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. ఈ రోజు ఇచ్చిన బాండ్ల కూడా పనికిరావు. రామానాయుడు సైకిల్ మీద ఇంటింటికి తిరిగి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. నేడు ప్రజలను ఇబ్బందులలో నెట్టారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు హామీలు అభివృద్ధి తర్వాతే అంటారు. జగన్ వల్లే హామీలు అమలు చెయ్యలేమని చేతకానీ మాటలు మాట్లాడుతున్నారు. మ్యానిఫెస్టో రూ.14 లక్షల కోట్లు అప్పు అన్నారు. రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుఅని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చింది కూటమీ ప్రభుత్వం.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల విద్యాదీవెన, వసతి దీవెన చెల్లించకుంటే వారి తల్లిదండ్రులతో మీ మెడలు వంచుతాము. అభివృద్ధి అంటే వల్గర్ పోస్టులు పెట్టడం కాదు. మీకు చేతకాకపోతే జగన్ దగ్గర కోర్సు తీసుకొండి . పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నా... హామీలు అమలు చెయ్యకపోతే ప్రశ్నించరా? మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదు. వడ్డీతో సహా తిరిగి ఇస్తాం..తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. ట్రోల్స్ చేస్తే వెనక్కి తగ్గుతామనుకున్నారేమో.. తగ్గేదేలే. పవన్ కూడా విద్యార్థుల బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment