ఆయన మంచోడే కానీ..
న్యూఢిల్లీ: రాష్ట్రంపై పెత్తనం విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్ తో ఏడాదిన్నరగా పోరాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా మాట మార్చేశారు. నిన్నమొన్నటివరకు ఎల్జేను తీవ్రస్థాయిలో దూషించిన కేజ్రీవాల్.. 'నజీబ్ జంగ్ చాలా మచివారు' అని కితాబిచ్చారు.
'నజీబ్ జంగ్ మంచోడే కానీ అతనికి ఆదేశాలిస్తున్న రాజకీయ గురువులే చెడ్డవాళ్లు. జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా అనిపిస్తుంది. అసలీ విషయంలో నజీబ్ జంగ్ చేసిన తప్పేంటి? కేంద్రం ఆదేశించినట్లు ఆయన నడుచుకుంటున్నారంతే. నజీబ్ ను తొలగించినంత మాత్రానేకాదు.. ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం ఆగితేనే ఢిల్లీ సమస్యలు పరిష్కారమవుతాయి' అని కేజ్రీవాల్ శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
కాగా, కేజ్రీ ట్వీట్ పై బీజేపీ భగ్గుమంది. 'ఢిల్లీ సీఎం గందరగోళం మనిషి. ఏ విషయాన్ని ఎలా చూడాలో ఆయనకు తెలియదు' అంటూ ఆ పార్టీ ఢిల్లీ నేత నళిన్ కోహ్లీ మరో ట్వీట్ లో విమర్శించారు.
Congress n BJP both demanding Sh Najeeb Jung's removal? Strange. Is he at fault? No. He is doin what PMO is asking him to do(1/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015
Removing him will not help. His successor wud also do same if PMO kept interfering. Real solution is PMO shud stop interfering in Delhi(2/2)
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015
Sh Najeeb Jung is a good man with bad political bosses
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015