ముంబయి : ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం రాత్రి వీరేంద్ర సింగ్ తావ్డేను అరెస్ట్ చేశారు. హిందు జన జాగృతి సభ్యుడు, వైద్యుడు అయిన తావ్డేకు దబోల్కర్ హత్యకేసులో ప్రమేయం ఉండటంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పరచనున్నారు.
ఈ సందర్భంగా సీబీఐ అధికారి దేవ్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ విచారణ కొనసాగుతోందని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తావ్డేను పుణె కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. కాగా దబోల్కర్ 2013 ఆగస్ట్ 20న ఆగంతకుల చేతిలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. దబోల్కర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.