పింప్రి, న్యూస్‌లైన్: పింప్రి-చించ్వాడ్‌లోని మారుతి లాండ్గే క్రీడా నగరిలో బుధవారం సాయంత్రం జరిగిన ‘మహారాష్ట్ర కేసరి’ కుస్తీ పోటీల్లో ఒలింపియన్ నరసింగ్ యాదవ్ విజేతగా నిలిచాడు. ముంబైకి చెందిన సునీల్ సాలుంఖేను కేవలం 1.5 నిమిషాల వ్యవధిలోనే ఓడించి హ్యాట్రిక్‌ను సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ పోటీలలో ఏ యోధుడు కూడా హ్యాట్రిక్ సాధించలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను వీక్షించేందుకు వందలాది మంది కుస్తీ ప్రేమికులు తరలివచ్చారని చెప్పారు. విజేతలకు హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెండి గదతోపాటు స్కార్పియో వాహనం అందజేశారు.
రన్నర్‌గా నిలిచిన సునీల్‌కు బుల్లెట్ ద్విచక్రవాహనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శివాజీరావు అడల్‌రావ్ పాటిల్, హింద్ కేసరి శ్రీపతి ఖంచనాలే, గణపత్‌రావు ఆందళ్‌కర్, మాజీ ఎం.పి.అశోక్ మోహోలే, శాసన సభ్యులు దిలీప్ మోహితే, అన్నాబన్సోడే, ఆజాభాయి పాన్సారే, యోగేష్ బహుల్, మహారాష్ట్ర కేసరి సంఘం కార్యదర్శి బాలాసాహెబ్ లాండే తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర కేసరి విజేత నరసింగ్ యాదవ్
Published Fri, Dec 6 2013 12:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:52 PM
Advertisement
Advertisement