చెన్నై: ఇది ఎన్నికల బరిలో ఉన్న జేడీయూ అభ్యర్థులు నెలకొన్న బెంగ. తమకు మద్దతుగా ప్రచారానికి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటూ ఎదురు చూపుల్లో అభ్యర్థులు ఉన్నారు. కేరళకు రాబోతున్న ఈ సారు..ఇక్కడికి వస్తారా? అన్న ప్రశ్న తప్పడం లేదు. రాష్ట్రంలో జేడీయూ నేతృత్వంలోని కొన్ని చిన్నాచితకా పార్టీలు, సంఘాలు, కుల పార్టీలు ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి.
తమకూ బలం ఉందని చాటుకునే విధంగా దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో పలు నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ చిహ్నం ‘ధనస్సు' ను ప్రజల్లోకి తీసుకెళ్లి, మద్దతు సేకరణలో తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆయా పార్టీలకు మద్దతుగా జాతీయ నేతలు తమిళనాడు వైపుగా తరలి వస్తుండడంతో తమ సారూ..వస్తారా..? అన్న ఎదురు చూపుల్లో అభ్యర్థులు ఉన్నారట.
దేశ వ్యాప్తంగా తమ పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నాల్లో ఉన్న బీహార్ సీఎం, జెడీయూ అధినేత నితీష్‌కుమార్ కేరళ ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టుగా సంకేతాలు రావడంతో ఇక్కడి అ భ్యర్థుల్లో ఎదురు చూపులు పెరి గాయి. కేరళకు వస్తున్న నితీష్ ఇక్కడ, ముఖ్య నియోజకవర్గా ల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందుకు తగ్గ వినతి ప త్రం ఇప్పటికే బీహార్ చేరినట్టు, ఆయన రావడం ఖాయం అన్న ధీమాను ఇక్కడి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొని మరో మారు సీఎంగా అవతరించిన నితీష్‌కు డీఎంకేతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ సమయంలో ఇక్కడికి ఆయన వచ్చిన పక్షంలో డీఎంకే, కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే దిశగా పరుగులు తీస్తున్న నితీష్, ఇక్కడి చిన్నా చితక అభ్యర్థుల కోసం వచ్చి రాజకీయ మేధావి కరుణతో వైర్యం పెంచుకోరని భావించ వచ్చు.