సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది | Nitya Menen in Suriya's '24' | Sakshi
Sakshi News home page

సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది

Published Thu, Jul 30 2015 12:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది

సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది

చెన్నై : కేరళ కుట్టి నిత్య మీనన్ ప్రముఖ నటుడు సూర్య పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.  తమిళ థ్రిల్లర్ చిత్రం '24' లో సూర్య పక్కన నటిస్తోంది. ఈ చిత్రంలో నిత్య కీలక పాత్ర పోషిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు గురువారం చెన్నైలో వెల్లడించాయి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమై... శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో టాలీవుడ్ హీరో నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం 'ఇష్క్'కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.


దాంతో విక్రమ దర్శకత్వంలో నిత్య  రెండో చిత్రం చేస్తుంది. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సమంతా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగులో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement