సాక్షి, చెన్నై : కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ ఎన్‌ఎల్‌సీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఘనతను వివరిస్తూ శనివారం స్థానికంగా మీడియాతో సురేంద్ర మోహన్ మాట్లాడారు. ఎన్‌ఎల్‌సీ నెలకొల్పి 59 ఏళ్లు అవుతోందని, ఈ కాలంలో సాధించిన రాబడిని తిరగ రాస్తూ సరికొత్త రికార్డును గత ఆర్థిక సంవత్సరం సృష్టించామన్నారు. నేల బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్‌ను అధిగమించామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌ఎల్‌సీలోని అన్ని సొరంగాల నుంచి గత సంవత్సరం 15 కోట్ల 92 లక్షల98 వేల గణమీటర్ల బొగ్గును తొలగించామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ కన్నా 2.77 శాతం ఎక్కువగా పేర్కొన్నారు. నేల బొగ్గు తవ్వకాల్లో 3.68 శాతం పెరిగిందన్నారు. రెండు కోట్ల 65 లక్షల 43 వేల టన్నుల మేరకు నేల బొగ్గు తవ్వకాలు జరిగాయన్నారు.
థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ పై చేయిగా నిలిచామన్నారు. 1972 కోట్ల 91 లక్షల 21 వేల యూనిట్లను ఉత్పత్తి చేశామన్నారు. తొలి యూనిట్ ద్వారా 338 కోట్ల 50 లక్షల 40 వేల యూనిట్లు ఉత్పత్తి అయిందని వివరించారు. ఇందులో 310 కోట్ల 72 లక్షల 80 వేల యూనిట్ల విద్యుత్‌ను ఎగుమతి చేయడం జరిగిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎన్‌ఎల్‌సీలో *6087 కోట్ల 68 లక్షల మేరకు వర్తకం జరిగిందని, తద్వారా *2383.33 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందన్నారు. పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం *1579 కోట్ల 68 లక్షలు వచ్చిందని, గతంలో ఏ సంవత్సరం సాధించనంతగా లాభాన్ని ఆర్జించడం జరిగిందని పేర్కొంటూ, ఇది ఎన్‌ఎల్‌సీ చరిత్రలో రికార్డుగా ప్రకటించారు. రానున్న రాజుల్లో ఎన్‌ఎల్‌సీ మరిన్ని ప్రాజెక్టుల దిశగా ముందుకు సాగుతుందన్నారు. జయం కొండాంలో ఐదు వందల మెగావాట్లతో కూడిన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. మరో 1250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో ఐదు వందలు చొప్పున రెండు విద్యుత్ ప్రాజెక్టులను తమిళనాడు విద్యుత్ బోర్డుతో కలసి చేపట్టేందుకు కార్యచరణ సాగుతోందని పేర్కొన్నారు.
ఎన్‌ఎల్‌సీ రికార్డు
Published Sun, May 31 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement