ఇకపై ఆర్టీఈ ఆన్‌లైన్‌లో
బెంగళూరు : నిర్బంద విద్యా హక్కు (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం కింద ప్రైవేటు పాఠశాల్లో ప్రవేశాలు పొందడానికి ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నివాస గృహానికి చుట్టుపక్కల ఉన్న మూడు పాఠశాలల్లో మాత్రమే ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ఎన్ని పాఠశాల్లోనైనా ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. రాష్ట్రవిద్యాశాఖ వచ్చే విద్యా ఏడాది ఆర్టీఈ క్యాలండర్‌ను కూడా ప్రకటించింది. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తన పరిధిలోని పాఠశాలల్లో ఉన్న ఆర్టీఈ సీట్ల వివరాలను www.schooleduction.kar.nic.in వెబ్‌సైట్‌లో 2015 జనవరి 12న అందుబాటులోకి తీసుకువస్తారు.
అదేనెల 13 నుంచి ఫిబ్రవరి 14 వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటోతరగతి, ప్రీ ప్రైమరి తరగతులకు తమ పిల్లలను ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఁమూడు పాఠశాలకే దరఖాస్తు* నిబంధనను సడలించే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.
► ఫిబ్రవరి 16 దరఖాస్తుల స్క్రూటినికి చివరి తేది
►ఫిబ్రవరి 19 అర్హత కలిగిన విద్యార్థుల పేర్ల ప్రకటన
► ఫిబ్రవరి 28 ఎంపికయిన విద్యార్థుల పేర్ల ప్రకటన
► ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 4 అభ్యంతరాలు స్వీకరణ
► మార్చ్ 7 తుది జాబితా ప్రకటన
► మార్చ్ 10 ఆర్టీఈ కింది ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం