కమల్‌ మనలో ఒకడు | Pannair Selvam said that Kamalasan is one of us | Sakshi
Sakshi News home page

కమల్‌ మనలో ఒకడు

Published Tue, Jul 25 2017 4:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

కమల్‌ మనలో ఒకడు

కమల్‌ మనలో ఒకడు

కాంచీపురం: సినీ నటుడు కమలహాసన్‌ ఒక తమిళుడు, మనలో ఒకడు అని  పన్నీర్‌ సెల్వం తెలిపారు. కాంచీపురం జిల్లాలోని ముత్యాలపేటలో అన్నాడీఎంకే  పుర ట్చి తలైవి అమ్మ విభాగం తరఫున శని వారం రాత్రి ఎంజీఆర్‌ శత వార్షికోత్సవాలు, పార్టీ అభివృద్ధి గురించి బహిరంగ సమావేశం శనివారం రాత్రి నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్‌వి.రంజిత్‌ కుమార్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ మైత్రేయన్‌ అధ్యక్షత వహించారు. మా జీ ముఖ్యమంత్రి, పార్టీ కోశాధికారి ఓ.పన్నీర్‌ సెల్వం ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. ఎంజీఆర్‌ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ (జయలలిత) బాధ్యతలు చేపట్టి  27ఏళ్ల పాటు పార్టీ కోసం పాటుపడ్డారన్నారు. తమ పార్టీని మట్టుపెట్టాలని కరుణానిధి, ఆయన వర్గీయులు కలలు కంటున్నారని, వారి కలలు ఎప్పటికీ నెరవేరేది లేదన్నారు.  రాజకీయ అక్రమాలను గురించి మాట్లాడడానికి అందరికీ హక్కు ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్, మాజీ మంత్రులు పొన్నయ్యన్, కేíపీ.మునుస్వామి, విశ్వనాథన్, సెమ్మలై పాల్గొన్నారు. ముం దుగా  పన్నీర్‌సెల్వంకు ఆరు అడుగుల వెండి కరవాలాన్ని  ఆర్‌వీ.రంజిత్‌కుమార్‌ బహూకరించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement