సాక్షి, చెన్నై: ప్రకటనల అనుమతి అధికారం మళ్లీ చెన్నై కార్పొరేషన్ పరిధికి చేరింది. ఇందుకు తగ్గ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. రాజధాని నగరం చెన్నైలో ఏదేని ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు , బోర్డులు ఏర్పాటు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ మేరకు గతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ అనుమతుల వ్యవహారం 2003లో చెన్నై జిల్లా కలెక్టరేట్‌కు చేరింది. కలెక్టరేట్‌లో అనుమతి పొందాలంటే, ముందుగా బోర్డు ఏర్పాటు చేసే పరిధిలోని పోలీసు స్టేషన్, కార్పొరేషన్ అధికారుల వద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తప్పని సరి.
ఈ ప్రక్రియ ముగియడానికి సమయం వృథా కావడమే కాకుండా, అవినీతి దొర్లుతున్నట్టు ఆరోపణలు మొదలయ్యాయి. అన్ని సంతకాలతో కలెక్టరేట్‌కు వెళ్తే, అక్కడ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో సిబ్బంది కొరతతో జాప్యం తప్పడం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు సైతం వేసింది. కొత్త నిబంధనల్ని అమలు చేసే రీతిలో హుంకు జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ కార్పొరేషన్‌కు అధికారాలు అప్పగించేందుకు తగ్గ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక చెన్నై జిల్లా కలెక్టరేట్‌లో అనుమతి పొందాల్సిన అవసరం లేదని, కార్పొరేషన్‌ను ఆశ్రయించి అనుమతులు పొందే విధంగా, ఈ అధికారం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రకటనల అనుమతులకు కార్పొరేషన్‌ను ఆశ్రయించాల్సిందిగా ఆయా సంస్థలకు అధికారులు సూచించే పనిలో పడ్డారు. తాజాగా అధికారం కార్పొరేషన్ గుప్పెట్లోకి చేరడంతో అధికార పక్షం వర్గాలకు మరింత పండుగే.
కార్పొరేషన్‌కు అనుమతి
Published Tue, Sep 20 2016 1:26 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement