► కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీల వేడుకోలు
► సహకారం కోసం వినతి
► సీఎం జయలలిత ఆదేశం
సాక్షి, చెన్నై: తమిళనాడు సహకార సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో ఆగిన సేవల పునరుద్ధరణకు రూ.3 వేల కోట్లను కేటారుుంచాలని కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. తమ అమ్మ జయలలిత ఆదేశాల మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. రూ.500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా, కేంద్ర సహకార సంఘాల పరిధిలోని బ్యాం కుల్లో సేవలు నిలిచిపోరుున విషయం తెలిసిందే. రైతు సంక్షేమం లక్ష్యంగా, గ్రామీణ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ బ్యాంకుల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నల్లధనం కట్టడి నిర్ణయం ఇరకాటంలో పడేసింది.
ఈ బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచిపోయారుు. ఈ సేవల పునరుద్ధరణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులకు నగదు మార్పిడి, రుణాల పంపిణీ, బకారుుల వసూళ్లకు తగ్గ సేవలు చేపట్టాలంటే, కొత్త నోట్లు తప్పనిసరి అయ్యారుు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీల బృందం ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సహకార సంస్థలు, సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో ఆగిన సేవలు, ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు.
రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ వినతి పత్రంలో పొందుపరిచారు. తమిళనాడులో 23 కేంద్ర సహకార బ్యాంకులు, 32 జిల్లా సహకార బ్యాంకులు, 4,480 ప్రాథమిక పరపతి సంఘాలు ఉన్నట్టు వివరించారు. ఎన్నికల వాగ్దానం మేరకు సహకారం సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ. 5,780 కోట్ల రుణాల్ని మాఫీ చేశారని వివరించారు. కావేరి డెల్టా రైతుల సంక్షేమార్థం ప్రస్తుతం రూ.64 కోట్లను ప్రకటించారని పేర్కొన్నారు.
ఈ సహకార సంస్థల ద్వారా సాగుతున్న రైతు అభ్యున్నతిని కాంక్షించే రుణాల పంపిణీ ప్రస్తుతం ఆగిపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా సేవలు నిలిచిపోయాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా, కేంద్ర సహకార సంఘాల పరిధిలోని బ్యాంకుల్లో నిలిచిపోరుున సేవలను పునరుద్ధరించాలంటే, రూ.3 వేల కోట్ల మేరకు కొత్త నోట్లు అవసరం అని పేర్కొన్నారు. ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవడంతో పాటుగా, డిపాజిట్లు, రుణాల చెల్లింపులకు పాత నోట్లను స్వీకరించేందుకు తగ్గ అనుమతులు ఇవ్వాలని, బీమా చెల్లింపులు చెక్కుల రూపంలో జారీకి తగ్గ చర్యలకు అవకాశం కల్పించాలని విన్నవించారు.
ఇలా ఉండగా అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో ఆర్థిక మంత్రితో భేటీ అయ్యేందుకు ముందుగా రైతులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. ఆ మేరకు ప్రాథమిక సహకార బ్యాంకుల్లో సభ్యులుగా ఉన్న వాళ్ల పేరిట జిల్లా, కేంద్ర సహకర బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం మేరకు జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల ఖాతాల్లో నగదు బదిలీ తదితర వ్యవహారాలకు తగిన నమోదులు సాగే విధంగా చర్యలకు అధికారుల్ని ఆదేశించారు
రూ.3వేల కోట్లు ప్లీజ్
Published Thu, Nov 24 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
Advertisement
Advertisement