పోలీస్ కస్టడీకి షాజహాన్
Published Wed, Aug 14 2013 3:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
సేలం, న్యూస్‌లైన్ : ఇంట్లో అక్రమంగా మారణాయుధాలు కలిఉన్న కేసులో అరెస్టు అయిన రౌడీ షాజహాన్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆడిటర్ రమేష్ హత్యలో షాజహాన్‌కు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిని విచారించాల్సి ఉందని, తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు సేలం జేఎం4వ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ మంగళవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి విజయలక్ష్మి సమక్షంలో జరిగిన విచారణలో జరిగింది. షాజహాన్‌ను రెండు రోజు పోలీసుల కస్టడీలో విచారణ జరిపేందుకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆన్‌లైన్‌లో లాటరీ: 39 మంది అరెస్టు
రాష్ట్రంలో నిషేదించిన లాటరీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న 39 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సేలం అస్తంపట్టి ప్రాంతంలో ఒక కార్యాలయంలో ఆన్‌లైన్ లాటరీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అస్తంపట్టి ఇన్‌స్పెక్టర్ కన్నన్ అధ్యక్షత పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అకస్మికంగా దాడులు నిర్వహించారు. సిక్కిం, బూటాన్ లాటరీలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తుండడం కనుగొన్నారు. దీంతో అక్కడ ఉన్న 39 మందిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Advertisement