Shah Jahan
-
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?
మొఘల్ చక్రవర్తులు అటు యుద్ధమైదానాలు, ఇటు అంతఃపురాలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. దీనితో పాటు ఆహార విభాగంలోనూ వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. బాబర్‌కు పాలనాకాలం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ప్రయోగాలేవీ చేయలేకపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే హుమాయున్ తన పాలనాకాలంలో చాలావరకూ తడబడుతూనే ఉన్నాడంటారు. అయితే అక్బర్‌కు తన పాలనలో తగినంత సమయం దొరకడంతో వివిధ రంగాలలో అనేక ప్రయోగాలు చేశాడంటారు. అక్బర్ తర్వాత జహంగీర్ కాలంలో, నూర్జహాన్ వివిధ రకాల మద్యాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేయించేవారు. వీటన్నింటిమధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జహంగీర్, అక్బర్‌లతో పోలిస్తే షాజహాన్ భార్యకు అత్యంత విధేయుడిగా ఉన్నాడని చెబుతారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై మోజు ఎందుకు పెరిగిందనే దాని వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తుంటుంది. షాజహాన్ హయాంలో ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ ఫ్లూ(అంటువ్యాధి) వ్యాపించింది. ఈ నేపధ్యంలో ప్రజల ఆహారంలో పెను మార్పు వచ్చింది. ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు నాటి చెఫ్‌లు, రాజ వైద్యులు కలిసి ఆహారంలో పలు రకాల ప్రయోగాలు చేశారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా ఉపయోగించసాగారు. ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు స్వయంగా షాజహాన్‌కు సూచించాడట. ఈ మేరకు షాజహాన్ తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడు. అది అతని ఆరోగ్యానికి తగినది కాకపోయినా దానినే అనుసరించేవాడట. షాజహాన్ ఎప్పుడూ యమునా నది నీరు తాగేందుకు ఇష్టపడేవాడు. మామిడిపండ్లన్నా షాజహాన్‌కు ఎంతో ఇష్టం. ప్రత్యేక తోటల నుంచి తాజా కూరగాయలు, నిమ్మ, దానిమ్మ, రేగు, పుచ్చకాయలను తెప్పించేవాడట. అంతే కాదు కొత్తిమీర, జీలకర్ర, పసుపు మొదలైనవాటిని ఎక్కువగా వినియోగించాలని షాజహాన్ తన వంటవాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవాడు. దీని వెనుక అతనికి ఆరోగ్యంపైగల శ్రద్ధనే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకపోతే ఆరోగ్యం మెరుగ్గా ఉండదని షాజహాన్ నమ్మేవాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి? -
తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే
గువాహటి: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహాన్‌కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు. అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే.. మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. NCERT తాజాగా మొఘలులపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము. కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చివేసి.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. నేటికి దీనిని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. Guwahati, Assam | Taj Mahal is not the symbol of Love. Shah Jahan built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: BJP leader Rupjyoti Kurmi (05.04) — ANI (@ANI) April 6, 2023 -
తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా కుమారి
జైపూర్: ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజ్ మహల్‌లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న ప్రాంతం.. తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని బుధవారం రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్ మహల్లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే తమ పూర్వీకులకు(జైపూర్ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు. -
Taj Mahal: వట్టి మాటకు గట్టి ప్రచారం!
తాజ్‌మహల్ నిర్మాణం వెనుక గొప్ప కళాచాతుర్యం ఉన్నట్లే కొన్ని పేలవమైన కల్పనలూ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూపమైన నిర్మాణం జరగకుండా తాజ్‌మహల్‌ను నిర్మించిన వారి చేతులను షాజహాన్ నరికించాడన్నది మనం వింటూ వస్తున్న ఒక కల్పన. గత డిసెంబరులో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌ను ప్రారంభించిన సందర్భంగా పారిశుధ్య కార్మికులపై పూలజల్లు కురిపించినప్పుడు... ‘నాటి రాజు షాజహాన్ కార్మికుల చేతులను నరికిస్తే.. నేటి రాజు నరేంద్ర మోదీ కార్మికులపై పూలవర్షం కురిపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అలా ఒక అవాస్తవానికి మళ్లీ పిలకలు బయల్దేరాయి. తాజ్‌మహల్ నిర్మాణం ఎలా సాగిందనేది చేతిరాతతో అరబిక్ లిపిలో పొందుపరిచి ఉన్న సమాచారం ఆధారంగా అర్థమౌతుందని యునెస్కో పేర్కొంది. తాజ్ గోపుర సమాధి, లోపలి వెలుపలి భాగాలను నిర్మించడానికి తాపీ పనివాళ్లను, రాళ్లు చెక్కేవారిని, మణులను పొదిగేవారిని, చిత్రకారులను, శిల్పకళా నిపుణులను ఆ కాలంలోనే షాజహన్ తన మొత్తం సామ్రాజ్యం నుండి, ఇంకా.. మధ్య ఆసియా, ఇరాన్ నుండి రప్పించారు. తాజ్ మహల్ ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలికి గొప్ప తార్కాణమని యునెస్కో కీర్తించింది. తాజ్ నిర్మాణ కార్మికులకు, కళాకారులకు ఇచ్చిన జీతభత్యాలు, నెలసరి వేతనాలలో షాజహాన్ గొప్ప ఉదారతను ప్రదర్శించినట్లు కూడా నాటి జమాఖర్చుల పుస్తకాలను బట్టి తెలుస్తోంది. ఉదా: రాళ్లను చెక్కే అటా ముహమ్మద్ అనే నిపుణుడికి నెలకు రూ.500 చెల్లించారు. ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా నుంచి వచ్చిన షాకీర్ ముహమ్మద్ అనే కట్టుబడి మేస్త్రి నెలకు రూ.400 అందుకున్నాడు. ముల్తాన్‌కు చెందిన తాపీ కార్మికుడు ముహమ్మద్ సజ్జాద్ నెలకు రూ. 590, లాహోర్ నుంచి వచ్చిన ముఖద్వార నిర్మాణ కార్మికుడు చిరంజీలాల్కు నెలకు రూ.800 ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన ఈ భారీ మొత్తాలను బట్టి వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో నిర్దిష్టమైన పనికి బాధ్యత వహించేవాళ్లనుకోవచ్చు. చెప్పి చేయించేవాళ్ల చేతులను కానీ, చెప్పింది చేసేవాళ్ల చేతులను కానీ షాజహాన్ నరికించారు అనడంలో ఆధారాల మాట అటుంచి, అసలు అర్థమే లేదు. (చదవండి: రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!) మేస్త్రీలు కాకుండా.. వాస్తుశిల్పులు, చేతిరాత నిపుణులు, నిర్వాహకులు కూడా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వాళ్ల గురించిన వివరాలూ రికార్డులలో ఉన్నాయి. ఇరాన్‌లోని షిరాజ్ ప్రాంతం నుంచి తన పెద్ద సోదరుడు అఫ్జల్‌ఖాన్‌తో కలిసి మొఘల్ ఆస్థానానికి వచ్చిన కాలిగ్రాఫర్ అమానత్ ఖాన్ ప్రత్యేక గౌరవ మర్యాదల్ని పొందారు. తాజ్ కుడ్యాలపై ఖురాన్ శాసనాలను అందంగా లిఖించే మహద్భాగ్యం అతడికి లభించింది. ముంతాజ్ సమాధిపై అతడు చెక్కిన అక్షర నగిషీలకు షాజహాన్ ముగ్ధుడై అతడికి ‘మాన్సాబ్’ అనే బిరుదును ప్రదానం చేశారు. భూమిపై హక్కులు సంక్రమింపజేసే అధికారిగా అది ప్రభువులిచ్చే బిరుదు. అమానత్ ఖాన్ తాజ్‌మహల్‌పై ఆరేళ్లు పనిచేశారు. సమాధి నగీషీ రాత 1638లో పూర్తయింది. ఆ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనిలో ఉన్నప్పుడే అతడి వ్యక్తిగత జీవితాన్ని విషాదం స్పృశించింది. లాహోర్‌లో ఉంటున్న అతడి సోదరుడు అఫ్జల్ ఖాన్ మరణించాడు. అమానత్ ఖాన్ తను సంపాదించినదంతా వెచ్చించి అఫ్జల్‌కు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. సోదరుడి మరణం తర్వాత కూడా అమానత్ తిరిగి ఇరాన్ వెళ్లలేదనీ, తాజ్‌మహల్ ప్రధాన వాస్తుశిల్పి, తన ఆప్తమిత్రుడు అయిన ఉస్తాద్ఖాన్ అభ్యర్థన మేరకు ఇక్కడే ఉండిపోయారనీ డబ్లు్య.ఇ. బెగ్లే అనే చరిత్రకారుడు రాశారు. (క్లిక్: పుష్కరం కిందే యుద్ధ బీజాలు) మొఘల్ చరిత్రలో అనేకమంది రూపకర్తలు, వాస్తుశిల్పులు ఎంతో ప్రాముఖ్యం పొందారు. వారిలో కొందరు తాజ్‌మహల్ నిర్మాణానికి పని చేశారు. ఇస్మాయిల్ అఫాండి టర్కీలోని ఒట్టోమన్ల కోసం గోపురాలను రూపొందించిన ఘనత కలవారు. ఖాజిమ్ఖాన్ లాహోర్‌కు చెందిన ఒక స్వర్ణకారుడు. తాజ్ సమాధి గోపురానికి కాంతులీనే తాపడం చేసినవారు. తాజ్‌మహల్ నిర్మాణంలో హస్తకళాకారులు, కార్మికులతో పాటు.. మేధాపరంగా వాస్తుశిల్పులు, సృజనశీలురు అందరూ కూడా షాజహాన్ అభిరుచికి, దార్శనికతకు తగ్గట్టుగా పని చేసి ఆయన నుంచి సత్కారాలు, బహుమానాలు పొందారే తప్ప చేతులు పోగొట్టుకోలేదు. ఎలాగో పుట్టి, ఎలాగో కొట్టుకు వస్తున్న వదంతి మాత్రమే అది. వదంతిని పునరావృతం చేయడం అంటే అజ్ఞానాన్నీ, చరిత్రపై అవగాహన లేమినీ ప్రదర్శించుకోవడమే. – ఎం.సలీమ్ బేగ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (జేకే) ముఖ్యాధికారి -
‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్‌మహల్‌ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్‌మహల్‌గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్ కట్టారు!
లక్నో : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ప్రకటనలతో ఇక తెరపడిందనుకున్న తాజ్‌మహల్ వివాదాన్ని బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ తిరగదోడే ప్రయత్నం చేశారు. తాజ్‌మహల్‌ను ఆ పేరుతో పిలవడానికే ఇష్టపడని ఆయన.. మొఘలులు హిందూ ఆలయాలను ధ్వసం చేశారని ఆరోపించారు. బుధవారం పలు జాతీయ మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు. ‘‘తేజో మహల్‌గా ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని కూల్చేసి షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టాడు. ఇప్పటికీ అక్కడ ఆలయ అవశేషాలున్నాయి. తాజ్‌మహల్ పైకప్పు నుంచి జారిపడే నీటిధార అప్పట్లో శివలింగంపై పడేది’’ అని వినయ్ కతియార్ చెప్పుకొచ్చారు. అయితే, తేజో మహల్‌ను ధ్వసం చేసి కట్టినంత మాత్రాన తాజ్ మహల్‌ను కూల్చేయాలని తాను అనబోనని, సీఎం ఆదిత్యనాథ్ ఆగ్రా పర్యటనను స్వాగతిస్తున్నానని ఎంపీ వినయ్ అన్నారు. తాజ్ మహల్ భారతీయ సాంస్కృతిక చిహ్నం కాబోదంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలతో చారిత్రక కట్టడంపై మొదలైన వివాదం.. నానాటికీ పెద్దదవుతూ వచ్చింది. రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ సంగీత్ సోమ్.. తాజ్, ద్రోహులు నిర్మించిన కట్టడమని, బానిస నిర్మాణమని వ్యాఖ్యానించడం తెలిసిందే. -
చేతుల్ని నిజంగా నరికేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ చుట్టూ అల్లుకుపోయిన మంచి, చెడు కథలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. 17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ బేగమ్ పేరిట ఈ సుందర స్మారక భవనాన్ని నిర్మించిన షా జహాన్ (షాహబ్ ఉద్దీన్ ముహమ్మద్ కుర్రమ్) తన తండ్రిని చెరసాలలో బంధించిన దుర్మార్గుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవానికి షా జహాన్ తన తండ్రి జహంగీర్‌ను చెరసాలలో బంధించలేదు. షా జహాన్నే ఆయన కుమారుడు ఔరంగా జేబు బంధించారనే విషయం చరిత్ర పుస్తకాలు చదువుకోని భారతీయుల కూడా తెలుసు. మొఘల్ చక్రవర్తులది తనయులను చంపేసే తండ్రుల సంస్కృతంటూ ప్రముఖ హిందూత్వ వాది, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, సంగీత్ సోమ్ను సమర్థించారు. తండ్రులను చెరసాలల్లో బంధించారే తప్ప తండ్రులను చంపిన మొఘల్ రాజుల గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇంకా రాజ్యం కోసం తండ్రులను చంపిన తనయుల చరిత్ర రాజ్పుత్లకే ఉంది. మెవార్ రాజు రాణా కుంభాను క్రీస్తుశకం 1468లో ఆయన కుమారుడు ఉదయ్ సింగ్ చంపేశారని, క్రీస్తు శకం 1724లో మార్వార్ రాజు అజిత్ సింగ్‌ను ఆయన కుమారులు భక్త్ సింగ్, అభయ్ సింగ్‌లు కలిసి చంపేశారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ఆస్తుల కోసం తండ్రులను చంపేసే సంస్కతి ఇప్పటికీ భారతీయుల్లో కనిపిస్తోంది. దినేష్ శర్మ మరో అడుగు ముందుకేసి షా జహాన్ తాజ్ మహల్‌ను నిర్మించిన కూలీల రెండు చేతులను నరికేయించారని వ్యాఖ్యానించారు. అలాంటి అందమైన నిర్మాణాన్ని మరో చోట నిర్మించకూడదనే భావంతోనే కూలీల చేతులను నరికేయించారన్నది తెలిసీ తెలియని శర్మ లాంటి వ్యక్తుల అభిప్రాయం. తాజ్ మహల్‌ను నిర్మించడానికి ముందే షా జహాన్‌కు మంచి బిల్డర్‌గా పేరుంది. అప్పటికే ఆయన ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, అజ్మీర్‌లో దాదాపు డజన్ కట్టడాలను పూర్తి చేశారు. ఒక కట్టడమయ్యాక అక్కడి నుంచి మరో చోటుకు కూలీలను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. కూలీలకు నిరంతరం పని కల్పించడ వల్ల వారిలో పని నైపుణ్యం పెరుగుతుందని, పైగా ఒకే వ్యక్తి వద్ద ఎక్కువ కాలం పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తారని కూడా ఆయన నమ్మేవారని చరిత్రకారులే చెప్పారు. ఈ రోజుల్లో లాగా నైపుణ్యం కలిగిన కూలీలు అప్పుడు పెద్దగా దొరికేవారు కాదు. అలాంటప్పుడు తాజ్ మహల్ లాంటి మహా సౌధాన్ని కట్టిన చేతులను బుద్ధి ఉన్నవారు ఎవరూ నరక్కోరు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అప్పటికే ప్రముఖుడైన జోహాన్నెస్ డీ లాయెత్ లాంటి యూరప్ చరిత్రకారులు ఆ సంఘటనను కచ్చితంగా నమోదు చేసేవారు. అప్పటి యూరప్ చరిత్రకారులు ఇలాంటి పుకార్లకు, రాజుల ప్రేమ పురాణాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు. ముంతాజ్ బేగమ్ మరణించాక షా జహాన్ తన పెద్ద కూతురు జహనారా బేగమ్‌ల ప్రణయ గాధలు అంటూ ప్రచారం చేసిన చరిత్రకారులు వేల మంది కార్మికుల చేతులను నరికితే పట్టించుకోరా? అప్పుడు ప్రచారంలో ఏ మాత్రంలేని షా జహాన్ ఘోర కృత్యం గురించి కొన్ని దశాబ్దాల తర్వాత ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? పైగా షా జహాన్, కూలీలకు ఇతరుల కన్నా ఎక్కువ వేతనాలిచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. అందుకేనేమో బ్రిటిష్ పాలకుల హయాంలోకన్నా షా జహాన్ కాలంలోనే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువని ఆర్థిక గణాంకాలే తెలియజేస్తున్నాయి (17వ శతాబ్దాన్ని 19వ శతాబ్దంలోని భారత ఆర్థిక వ్యవస్థ పోల్చి చూడండి!). షా జహాన్ విదేశీయుడని సోమ్, శర్మ కూటమి పేర్కొంది. తన జీవితాంతం భారత ఉపఖండంలోనే జీవించిన ఆయనకు మూగ్గురు రాజ్‌పుత్ తాతలు, ఒక పర్షియన్, ఆసియన్ తాత కూడా ఉన్నారు. లియో వర్ద్కర్ ఐరిస్ అని, బరాక్ ఒబామా అమెరికన్ అని ఒప్పుకుంటే షా జహాన్‌ను కూడా భారతీయుడని ఒప్పుకోవాల్సిందే. ఓ అద్భుతమైన కట్టడం వెనక ఓ చీకటి కోణం దాగుందని చెప్పడం మానవ సంస్కృతిలో భాగంగా కనిపిస్తోంది. మాస్కోలోని ప్రముఖ సెయింట్ బేసిల్స్ కెథడ్రల్కు ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన తన కుమారుడైన పోస్తిక్ యకోవ్లెÐŒ ను రష్యా జారు చక్రవర్తి ఇవాన్ ది టెరిబుల్ చంపాలనుకోవడం కూడా అలాంటిదే. బాంబేలోని తాజ్ మహల్ హోటల్‌కు కూడా అలాంటి కథనే అల్లారు. తాను గీసిన ప్లాన్‌ను ముందు భాగాన్ని వెనక్కి, వెనక భాగాన్ని ముందుకు కట్టారని తెలిసి దాని ఆర్కిటెక్ట్ తాజ్‌మహల్ హోటల్ పైనుంచి దూకి చనిపోయారని చెబుతారు. తాజ్ మహల్ ఒకప్పటి ‘తేజో ఆలయం’గా పిలిచే శివాలయం అనే వాదనలో ఎంత నిజం ఉందో, కార్మికుల చేతులు నరకడంలోనూ అంతే నిజం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడంతో మొదలైన ‘తాజ్ మహల్’ వివాదం ప్రధాని జోక్యంతో చివరకు తన మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించారేమో భారతీయుల రక్తం, స్వేదంతో తడిసిన తాజ్ మహల్‌ను రక్షించాల్సిన బాధ్యత తన రాష్ట్రానిదేనని చెప్పారు. పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి దాన్ని తొలగించినప్పుడు అనవసరంగా ఓ సమాధిని రక్షించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అర్థరహితమన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా సమయానుకూలంగా వ్యవహరించడం తెలివైన రాజకీయ నేతల పని. అంత రక్తంతోకాకపోయిన కార్మికుల స్వేదంతో తడిసిన సౌధాన్ని ఏ దేశమైనా రక్షించుకోవాల్సిందే. -
యువ రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక యువరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో బుధవారం సాంయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాజహాన్(24) తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు తల్లి దండ్రులు పొలం వద్దకు వెళ్లాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటి కి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు ఇది గుర్తించి అప్పుల బాధ తాళలేక తమ కొడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమ నగరి
నేడు ప్రేమికుల దినోత్సవం ‘కమల్ ఖిల్తే హై.. ఆంఖ్ భరాతీ హై జబ్ కభీ లబ్‌పే తేరా నామ్ వహ్వా ఆతా హై...’ (నీ వలపుల పేరు పెదవులపై నడయాడినంతనే కమలాలు వికసిస్తాయి. కళ్లు ఆనందంతో మెరుస్తాయి.) భాగమతిని గురించి కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ స్పందన ఇది. షాజహాన్ తన ప్రియురాలి కోసం ఒక్క తాజ్‌మహల్‌నే కట్టించాడు. కానీ.. మానవ ఇతిహాసంలో ప్రేమ పునాదులపై నిర్మితమైన మహా నగరం బహుశా.. మన ఘన భాగ్యనగరి మాత్రమేనేమో... -
రాణి గారి బావి
యునెస్కో హోదా! షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ని కట్టించాడని, కులీకుతుబ్ షా భాగమతి జ్ఞాపకార్థం భాగ్యనగరం నిర్మించాడని మనకు తెలుసు. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం భూగర్భంలో కోటలా ఉండే మెట్ల బావిని నిర్మించిన విషయం తెలుసా! ఈ అద్భుత కట్టడం మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ పట్టణంలో ఉంది. ఈ కట్టడం ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకునే పరిజ్ఞానానికి గుజరాత్ మెట్లబావి (రాణి కి వావ్) నిలువెత్తు నిదర్శనం. సోలంకి సంస్థానానికి చెందిన రాణీ ఉదయమతి తన భర్త ఒకటవ భీమ్దేవ్ జ్ఞాపకార్థం 1063లో ఈ బావిని నిర్మించారు. ఆ తర్వాత సరస్వతి నదికి వచ్చిన వరదలకు ఈ బావి పూడికతో నిండిపోయింది. నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగైంది. 1980లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ మెట్ల బావి వెలుగులోకి వచ్చింది. విస్మయపరిచే శిల్ప సంపద నలుచదరంగా ఉండే ఈ మెట్ల బావి నిర్మాణం నిపుణులను, పర్యాటకులను విస్మయపరుస్తోంది. మొత్తం ఏడు అంతస్తులు. ప్రస్తుతం ఐదు అంతస్తులను మనం చూడొచ్చు. ఈ అంతస్తులలో ఎటు చూసినా అబ్బుపరిచే శిల్పకళ నాటి కళావైభవానికి అద్దంపడుతోంది. 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఈ బావి ఓ భూగర్భ కోటలా, దేవాలయం లా ఆకట్టుకుంటుంది. దశావతారాలు ఈ నిర్మాణంలో 1,500ల ప్రధాన దేవతా శిల్పాలు ఉన్నట్టు కనిపెట్టారు నిపుణులు. వీటిలో విష్ణువు దశావతారాలైన వారాహి, వామన, నరసింహ, రామ, కల్కి శిల్పాలు... మహిషాసుర మర్ధినితో పాటు నాగకన్య, యోగిని, ఇతర 16 రకాల శైలులుగా ఆక ర్షణీయంగా కనిపించే అప్సరసల శిల్పాలు అబ్బురపరుస్తుంటాయి. ఈ బావి అడుగున 28 కిలోమీటర్ల పొడవున ఓ సొరంగం ఉండేదని, ఇప్పుడు అది అంతా మట్టితో నిండి ఉందని చెబుతారు. యునెస్కో హోదా! ఈ మెట్లబావి విశిష్టతను తెలియజేస్తూ ప్రభుత్వం యునెస్కో సంస్థకు కిందటేడాది దరఖాస్తు చేసింది. యునెస్కో ప్రతినిధులు ఈ మెట్ల బావి వైభవం చూసి, ప్రపంచ ప్రాచీన వారసత్వ జాబితాలో చోటు కల్పించింది. ఆ విధంగా మనదేశంలో గుర్తింపు పొందిన వారసత్వ సంపద జాబితాలో 31వ స్థానంలో నిలిచింది ఈ మెట్ల బావి. ప్రపంచ టూరిజం మ్యాప్‌లో మెట్ల బావికి స్థానం దక్కడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతంగా రాణి మెట్ల బావి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పటాన్ పట్టణం ఇలా చేరాలి: ‘రాణి కి వావ్’ను చూడటానికి రోడ్డు, రైలు, వాయు మార్గంలో అహ్మదాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడు-నాలుగు గంటల వ్యవధిలో మెహసానా చేరుకుని, అటు నుంచి ఒక గంటలో పటాన్ పట్టణం చేరవచ్చు. మెహసానా నుంచి ట్యాక్సీలు, జీపులు లభిస్తాయి. సమీప రైలు స్టేషన్ మెహసానాలో ఉంది. సమీప ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. -
తాజ్‌మహల్ ఎదురుగా షాజహాన్ వేసవి బంగ్లా!
ఆగ్రా: మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ఎదురుగా మెహ్తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్తాబ్(అంటే ఉర్దూలో వెన్నెల) బాగ్‌లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్‌మహల్‌ను చూస్తూ గడుపుతుండేవారని పరిశోధకులు చెబుతున్నారు. భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మెహ్తాబ్ బాగ్‌లో తూర్పువైపున 1997-99 మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటెయిన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి (అన్ని వైపుల నుంచీ గాలి వీచేలా కట్టిన మండపం) శిథిలాలు వెలుగుచూశాయి. తాజాగా తాజ్‌మహల్‌కు సూటిగా మెహ్తాబ్ బాగ్‌లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్‌మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్‌మహల్‌ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది. షాజహాన్ నల్లరాతి తాజ్‌మహల్‌ను నిర్మించాలనుకున్నది మెహ్తాబ్ బాగ్లోనేని పలువురు గైడ్లు చెబుతుంటారు కూడా. కానీ బ్లాక్ తాజ్‌మహల్ నిర్మాణ ం గురించి షాజహాన్ ఆలోచించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి చారిత్రక ఆధారాలు లభించలేదు. -
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ నయ వంచన
నమ్మించి మహిళను లొంగదీసుకుని దగా డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు కదిరి టౌన్:చట్టాన్ని రక్షిస్తూ.. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుని.. ఆపై వంచించాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కదిరి పట్టణ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. శనివారం బాధితురాలు మీడియాకు ఈ వివరాలు వెల్లడించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మేరీ(38) కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. మదనపల్లిలోనే ఆమె ఆదర్శ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. అప్పట్లో తన సంస్థ కార్యక్రమాలకు కదిరి ఎమ్మెల్యే షాజహాన్‌ను ఆహ్వానిస్తుండేది. అప్పట్లో ఆయన వద్ద గన్‌మెన్‌గా ఉన్న వివాహితుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు(పీసీ-141) మేరీతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యేతో చెప్పి చేయిస్తానంటూ ఆశ చూపాడు. అనంతరం నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు. ఏడాది క్రితం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో.. తనకు తిండితో ఇబ్బందిగా ఉందని, కదిరికి వచ్చి తనతో పాటు ఉండాలని మేరీని కోరాడు. కానీ తన సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, తర్వాత కొందరితో చెప్పించడంతో ఒప్పుకుంది. దీంతో మే 23న కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసి సదరు కానిస్టేబుల్ సోదరుడు వెంకటస్వామి, అతని ఇరువురు కుమారులు ఇటీవల మేరీ ఇంట్లోకి చొరబడి నానా దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం చేశారు. ఆంజనేయులు సైతం తనను కులం పేరుతో దూషిస్తూ.. ఇకపై నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు.. జరిగిన విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి, వస్తువులు చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు డీఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని, నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కానిస్టేబుల్ ఆంజనేయులుపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ దేవదానం, పట్టణ ఎస్ఐ-2 రహిమాన్ తెలిపారు. -
అపురూపం: చెక్కు చెదరని జ్ఞాపకాల మందిరం
తాజ్‌మహల్! ప్రపంచ వింతల్లో ఒకటి! ఒక భర్త తన భార్య గుర్తుగా ఇంత భారీగా కట్టించిన మహల్ భువిపై ఇంకొకటి లేదు! మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు భార్య ముంతాజ్ అంటే ఎంతో ప్రేమ! ఆమె 1631లో పరమపదించారు. ఆమె గుర్తుగా తాజ్‌మహల్‌ని కట్టారు షాజహాన్! ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో... యమునా నదీ తీరాన... పూర్తిగా పాలరాయితో... వెయ్యి ఏనుగుల సాయంతో... ఇరవై వేల మంది కార్మికులు ఇరవై రెండేళ్ల పాటు శ్రమించి నిర్మించిన అతిగొప్ప కట్టడమిది! కట్టి శతాబ్దాలు అవుతోంది. అయినా దాని వన్నె తగ్గలేదు. కనీసం ఒక్కసారైనా ఆ మహాకట్టడాన్ని చూడాలని ఉబలాటపడేవారే అందరూ! సినీ తారలూ దీనికి మినహాయింపు కాదు! నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించుకున్నప్పటి ఫొటోని పైన చూడవచ్చు! అలాగే ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహానటి సావిత్రి, ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్, వారి అర్థాంగి కమలా గణేశన్ ప్రత్యేకంగా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ని దర్శించుకున్నప్పటి స్టిల్ కూడా. అలాగే నేటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన శ్రీమతి లక్ష్మితో కలిసి తాజ్‌మహల్ ముందు తీపిగుర్తుగా తీయించుకున్న స్టిల్. అమెరికా అధ్యక్షుడైనా అతి సామాన్యుడైనా తాజ్‌మహల్ అందాలకు ముగ్ధుడవ్వాల్సిందే. ఆ నిర్మాణానికి ఆశ్చర్యపోవాల్సిందే. దాని ముందు ఫొటో దిగాల్సిందే! ఎందుకంటే... తాజ్‌మహల్ వంటి దృశ్యకావ్యం మరొకటి లేదు గనుక! వేరొకటి సాటి రాదు గనుక!! ఇంకొకటి కట్టలేరు గనుక!!! - సంజయ్ కిషోర్ -
పోలీస్ కస్టడీకి షాజహాన్
సేలం, న్యూస్‌లైన్ : ఇంట్లో అక్రమంగా మారణాయుధాలు కలిఉన్న కేసులో అరెస్టు అయిన రౌడీ షాజహాన్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆడిటర్ రమేష్ హత్యలో షాజహాన్‌కు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిని విచారించాల్సి ఉందని, తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు సేలం జేఎం4వ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ మంగళవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి విజయలక్ష్మి సమక్షంలో జరిగిన విచారణలో జరిగింది. షాజహాన్‌ను రెండు రోజు పోలీసుల కస్టడీలో విచారణ జరిపేందుకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్లో లాటరీ: 39 మంది అరెస్టు రాష్ట్రంలో నిషేదించిన లాటరీలను ఆన్లైన్లో నిర్వహిస్తున్న 39 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సేలం అస్తంపట్టి ప్రాంతంలో ఒక కార్యాలయంలో ఆన్లైన్ లాటరీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అస్తంపట్టి ఇన్స్పెక్టర్ కన్నన్ అధ్యక్షత పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అకస్మికంగా దాడులు నిర్వహించారు. సిక్కిం, బూటాన్ లాటరీలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండడం కనుగొన్నారు. దీంతో అక్కడ ఉన్న 39 మందిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.