సీఎస్‌కే వెనుక ప్రకాష్‌రాజ్ మాజీ భార్య
నటుడు ప్రకాష్‌రాజ్ మాజీ భార్య లలితకుమారి లేకుంటే సీఎస్‌కె (చార్లెస్ షేపిక్ కార్తిక్) చిత్రం ఉండేది కాదంటున్నారు ఆ చిత్ర యూనిట్. చరణ్‌కుమార్, మిషాల్ నజీర్, జయ్‌కుహ్యాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ ఫిలిం పతాకంపై శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు సత్యమూర్తి శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ మోహన్ సంగీతాన్ని అందించారు. చిత్ర దర్శకుడు సత్యమూర్తి శరవణన్‌ను మాటల రచయిత, సంగీత దర్శకుడు, ఛాయా గ్రాహకుడిని వెనకుండి ప్రోత్సహించింది ప్రకాష్‌రాజ్ మాజీ భార్య లలితకుమారినేనట. ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్ ఆమేనట. శనివారం జరిగిన సీఎస్‌కే చిత్ర ఆడియో ఆవిష్కరణలో ఈ విషయాన్ని దర్శకుడు తెలుపుతూ లలితకుమారి లేకుంటే ఈ చిత్రం లేదన్నారు.
చిత్రకారుడైన సత్యమూర్తి శరవణన్ లలితకుమారి కూతురికి చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారట. ప్రకాష్ రాజ్ వద్ద ఇనిదుఇనిదు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సత్యమూర్తి సీఎస్‌కే చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. లలితకుమారి మాట్లాడుతూ ఈ రోజు తన కూతురు విదేశాల్లో ఫైన్ ఆర్ట్స్ రంగంలో పెద్ద చదువులు చదువుతుందంటే అందుకు ఈ చిత్ర దర్శకుడు సత్యమూర్తి శరవణనే కారణం అన్నారు. ఆయనరుణం తీర్చుకోవడానికి ఏమైనా చేయాలన్న భావనతోనే ప్రకాష్‌రాజ్ వద్ద సహాయ దర్శకుడిగా చేర్పించానన్నారు. అదే విధంగా ఈ చార్లెస్ ఫేషిక్ కార్తిక్ చిత్రానికి తన చేతనైన సాయం చేశానని అన్నారు. కలైపులి ఎస్.థాను, రాధాకృష్ణన్, దర్శకుడు అట్లీ, రంజిత్, నటుడు బాబి సింహా, నటి చంద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.