(ఫైల్ ఫోటో)
ముంబై: సీఎస్‌కే కెప్టెన్‌గా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎంఎస్ ధోనిపై దిగ్గజ క్రికెటర్ సునీల గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. విశేషమైన కెప్టెన్సీ అనుభవం ఉన్న ధోని మరొకసారి తన కెప్టెన్సీ చాతుర్యం ప్రదర్శించాడని గావస్కర్ కొనియాడాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఘన విజయం సాధించడానికి ధోని మాస్టర్ కెప్టెన్సీనే కారణమన్నాడు. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గావస్కర్.. సీఎస్‌కే తరఫున 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేయడానికి ధోనికి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. అత్యుత్తమ కెప్టెన్ అనడానికి రాజస్థాన్‌తో ధోని సారథ్యం ఒక్కటి సరిపోతుందన్నాడు.
బౌలింగ్‌లో వెంట వెంటనే మార్పులు.. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ ఇలా ప్రతీది ఆకట్టుకుందన్నాడు. ప్రత్యేకంగా జడేజాను సరైన స్థానంలో ఫీల్డింగ్ పెట్టి సక్సెస్ అయిన తీరు ధోని కెప్టెన్సీకి నిదర్శమన్నాడు. ఇక్కడ జడేజా నాలుగు క్యాచ్‌లు పట్టడమే కాకుండా, చాలా బౌండరీలను నిలువరించాడన్నాడు. ఒక సరైన ఫీల్డర్‌ని ఎక్కడ పెట్టాలనేది గేమ్‌కు చాలా ముఖ్యమని పేర్కొన్న గావస్కర్.. ధోనిని ఈ విషయంలో ఎంత పొగిడినా తక్కువేనన్నాడు.
బంతిలో మార్పు ఎప్పుడైతే మార్పు రావడం గమనించాడో అప్పుడు జడేజా చేతికి బంతిని అందించాడన్నాడు. దాంతోనే మంచి ఊపు మీద ఉన్న బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడన్నాడు. బంతి టర్న్ అవడాన్ని పసిగట్టిన ధోని.. వెంటనే హిందీలో జడేజాకు చెప్పాడన్నాడు. ఆపై మొయిన్ అలీని బౌలింగ్ ఎటాక్‌కు తీసుకొచ్చి రాజస్థాన్ వికెట్లను వరుసగా కూల్చి పైచేయి సాధించడన్నాడు. ధోని నిజంగా అద్భుతం.. అద్వితీయం అని గావస్కర్ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇక్కడ చదవండి: IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్...
Comments
Please login to add a commentAdd a comment