csk movie
-
పొలార్డ్ కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాం..
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ ఐపీఎల్లో చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనియాడాడు. బంతిని హిట్ చేసేటప్పుడు పొలార్డ్ కచ్చితమైన టైమింగ్‌తో ఉంటాడన్నాడు. పొలార్డ్ క్రీజ్‌లో పాతుకుపోతే ప్రమాదమనే విషయం తమకు తెలుసని, అతన్ని ఔట్ చేయడానికి అన్ని అస్త్రాలు ప్రయోగించామన్నాడు. కానీ చివరకు అతన్ని పెవిలియన్‌కు చేర్చడంలో విఫలం కావడంతోనే తమను పరాజయం వెక్కిరించిందన్నాడు. మ్యాచ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడిన ఫ్లెమింగ్.. ‘ అసలు పొలార్డ్ ఏ షాట్ ఎలా ఆడతాడో కచ్చితంగా అంచనా వేయలేం. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ముంబైకు ప్రధాన ఆటగాడు. అతన్ని ఔట్ చేయడానికి చాలా ప్రయోగాలు చేశాం. కానీ నిలువరించలేకపోయాం. ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు తీసిన తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశాం. మేము చాలా మంచి టార్గెట్ ముంబై ముందు ఉంచాం. అయినా కొన్ని తప్పిదాలతో ఓటమి పాలయ్యాం. మేము చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతాం. మేము మరింత కసిగా తుదపరి మ్యాచ్‌కు వస్తాం. టోర్నమెంట్లో ఓడిపోతే ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందనే అంటారు. అది సర్వసాధారణం’ అని తెలిపాడు. కాగా, సీఎస్కే నిర్దేశించిన 219 పరుగుల భారీ టార్గెట్‌లో పొలార్డ్ 34 బంతుల్లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన పొలార్డ్.. మ్యాచ్‌ను గెలిపించేతవరకూ క్రీజ్‌లో ఉండి తన బ్యాటింగ్ పవర్ చూపెట్టాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు పిండుకుని ముంబైకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక్కడ చదవండి: డేవిడ్ వార్నర్‌కు నో ప్లేస్ మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్ ఓవర్ బౌలర్ ఎక్కడ? వార్నర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ -
‘ధోని.. నువ్వు నిజంగా అద్వితీయం’
ముంబై: సీఎస్కే కెప్టెన్‌గా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎంఎస్ ధోనిపై దిగ్గజ క్రికెటర్ సునీల గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. విశేషమైన కెప్టెన్సీ అనుభవం ఉన్న ధోని మరొకసారి తన కెప్టెన్సీ చాతుర్యం ప్రదర్శించాడని గావస్కర్ కొనియాడాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘన విజయం సాధించడానికి ధోని మాస్టర్ కెప్టెన్సీనే కారణమన్నాడు. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గావస్కర్.. సీఎస్కే తరఫున 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేయడానికి ధోనికి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. అత్యుత్తమ కెప్టెన్ అనడానికి రాజస్థాన్‌తో ధోని సారథ్యం ఒక్కటి సరిపోతుందన్నాడు. బౌలింగ్‌లో వెంట వెంటనే మార్పులు.. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ ఇలా ప్రతీది ఆకట్టుకుందన్నాడు. ప్రత్యేకంగా జడేజాను సరైన స్థానంలో ఫీల్డింగ్ పెట్టి సక్సెస్ అయిన తీరు ధోని కెప్టెన్సీకి నిదర్శమన్నాడు. ఇక్కడ జడేజా నాలుగు క్యాచ్‌లు పట్టడమే కాకుండా, చాలా బౌండరీలను నిలువరించాడన్నాడు. ఒక సరైన ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలనేది గేమ్‌కు చాలా ముఖ్యమని పేర్కొన్న గావస్కర్.. ధోనిని ఈ విషయంలో ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. బంతిలో మార్పు ఎప్పుడైతే మార్పు రావడం గమనించాడో అప్పుడు జడేజా చేతికి బంతిని అందించాడన్నాడు. దాంతోనే మంచి ఊపు మీద ఉన్న బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడన్నాడు. బంతి టర్న్ అవడాన్ని పసిగట్టిన ధోని.. వెంటనే హిందీలో జడేజాకు చెప్పాడన్నాడు. ఆపై మొయిన్ అలీని బౌలింగ్ ఎటాక్‌కు తీసుకొచ్చి రాజస్థాన్ వికెట్లను వరుసగా కూల్చి పైచేయి సాధించడన్నాడు. ధోని నిజంగా అద్భుతం.. అద్వితీయం అని గావస్కర్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడ చదవండి: IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్... -
సీఎస్కే వెనుక ప్రకాష్‌రాజ్ మాజీ భార్య
నటుడు ప్రకాష్‌రాజ్ మాజీ భార్య లలితకుమారి లేకుంటే సీఎస్కె (చార్లెస్ షేపిక్ కార్తిక్) చిత్రం ఉండేది కాదంటున్నారు ఆ చిత్ర యూనిట్. చరణ్‌కుమార్, మిషాల్ నజీర్, జయ్కుహ్యాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్ఎస్ ఫిలిం పతాకంపై శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు సత్యమూర్తి శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ మోహన్ సంగీతాన్ని అందించారు. చిత్ర దర్శకుడు సత్యమూర్తి శరవణన్‌ను మాటల రచయిత, సంగీత దర్శకుడు, ఛాయా గ్రాహకుడిని వెనకుండి ప్రోత్సహించింది ప్రకాష్‌రాజ్ మాజీ భార్య లలితకుమారినేనట. ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్ ఆమేనట. శనివారం జరిగిన సీఎస్కే చిత్ర ఆడియో ఆవిష్కరణలో ఈ విషయాన్ని దర్శకుడు తెలుపుతూ లలితకుమారి లేకుంటే ఈ చిత్రం లేదన్నారు. చిత్రకారుడైన సత్యమూర్తి శరవణన్ లలితకుమారి కూతురికి చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారట. ప్రకాష్ రాజ్ వద్ద ఇనిదుఇనిదు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సత్యమూర్తి సీఎస్కే చిత్రం ద్వారా దర్శకుడయ్యారు. లలితకుమారి మాట్లాడుతూ ఈ రోజు తన కూతురు విదేశాల్లో ఫైన్ ఆర్ట్స్ రంగంలో పెద్ద చదువులు చదువుతుందంటే అందుకు ఈ చిత్ర దర్శకుడు సత్యమూర్తి శరవణనే కారణం అన్నారు. ఆయనరుణం తీర్చుకోవడానికి ఏమైనా చేయాలన్న భావనతోనే ప్రకాష్‌రాజ్ వద్ద సహాయ దర్శకుడిగా చేర్పించానన్నారు. అదే విధంగా ఈ చార్లెస్ ఫేషిక్ కార్తిక్ చిత్రానికి తన చేతనైన సాయం చేశానని అన్నారు. కలైపులి ఎస్.థాను, రాధాకృష్ణన్, దర్శకుడు అట్లీ, రంజిత్, నటుడు బాబి సింహా, నటి చంద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.