
రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ
రాయచూరు రూరల్ : రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు. 2013 అసెంబ్లీ ఎన్నికలో నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్నం కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయన్నారు. అభినేత్రి సినిమా విడుదల కానుండడంతో గతంలో రెండు సార్లు కోర్టుకు హాజరు కాలేదని, సోమవారం కేసు విచారణ ఉండడం వల్ల హాజరయ్యానన్నారు.