Pujagandhi
-
అంతకు మించి...
విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘దండుపాళ్యం’. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం 2’ వచ్చింది. ఆ రెంటినీ మించేలా ‘దండుపాళ్యం 3’ రాబోతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసు కున్న శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరాజు కథ, కథనం, సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయి. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘దండుపాళ్యం’ సిరిస్‌కి ఇదే చివరి పార్ట్ కావటంతో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. త్వరలోనే ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తాం. మార్చి 2న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర ్పణ: సాయికృష్ణ ఫిల్మ్స్, సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట్ ప్రసాద్, సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల. -
శ్రీమఠంలో సినీ నటి పూజాగాంధీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ నటి పూజా గాంధీ శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఆమెకు మఠం మర్యాదలతో ఆహ్వానం పలికారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జా్ఞపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. -
రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ
రాయచూరు రూరల్ : రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు. 2013 అసెంబ్లీ ఎన్నికలో నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్నం కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయన్నారు. అభినేత్రి సినిమా విడుదల కానుండడంతో గతంలో రెండు సార్లు కోర్టుకు హాజరు కాలేదని, సోమవారం కేసు విచారణ ఉండడం వల్ల హాజరయ్యానన్నారు. -
కోర్టుకు హాజరైన సినీ నటి
రాయచూరు రూరల్ : కన్నడ సినీ నటి పూజాగాంధీ శుక్రవారం స్థానిక జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2013 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్ఆర్ సీపీ తరఫున రాయచూరు సిటీ స్థానం నుంచి ఆమె పోటీచేసిన సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును ఈనెల 25కు వాయిదా వేశారు. సెప్టెంబర్ 2వ వారంలో ‘అభినేత్రి’ విడుదల అనంతరం పూజాగాంధీ విలేకరులతో మాట్లాడారు. నటి కల్పన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన అభినేత్రి చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కల్పన తరఫువారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో అభినేత్రి చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు పూజాగాంధీ తెలిపారు. ప్రముఖ ప్రధాన కన్నడ సినీ నటుడు శివరామపై అమితమైన అభిమానం ఉందని వివరించారు. ఎన్నికల సమయంలో రాయచూరు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు.