కోర్టుకు హాజరైన సినీ నటి | Actress pujagandhi attend court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన సినీ నటి

Published Sat, Aug 23 2014 8:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

కోర్టుకు హాజరైన సినీ నటి

కోర్టుకు హాజరైన సినీ నటి

రాయచూరు రూరల్ : కన్నడ సినీ నటి పూజాగాంధీ శుక్రవారం స్థానిక జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2013 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్‌ఆర్ సీపీ తరఫున రాయచూరు సిటీ స్థానం నుంచి ఆమె పోటీచేసిన సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును ఈనెల 25కు వాయిదా వేశారు.
 సెప్టెంబర్ 2వ వారంలో ‘అభినేత్రి’ విడుదల అనంతరం పూజాగాంధీ విలేకరులతో మాట్లాడారు.

నటి కల్పన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన అభినేత్రి చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కల్పన తరఫువారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో అభినేత్రి చిత్రాన్ని  సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు పూజాగాంధీ తెలిపారు. ప్రముఖ ప్రధాన కన్నడ సినీ నటుడు శివరామపై అమితమైన అభిమానం ఉందని వివరించారు. ఎన్నికల సమయంలో రాయచూరు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement