సైన్స్ కాంగ్రెస్ విజయవంతం చేయాలని..
Published Sat, Dec 31 2016 2:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
తిరుపతి: తిరుపతిలో వచ్చే నెల 4, 5 ,6 తేదీల్లో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ జయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ వరకు సాగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement