
ట్రక్కు కిందపడి నుజ్జునుజ్జైన ద్విచక్ర వాహనం
వైట్‌ఫీల్డ్ : ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెప్పపాటుతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్–హోప్‌ఫార్మ్ సిగ్నల్స్ సర్కిల్‌లో జరిగిన సంఘటన వివరాలు...రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన చందన్ (29) తన ద్విచక్ర వాహనంలో ఐటీపీఎల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ద్విచక్ర వాహనాన్ని ట్రక్ ఢీకొనడంతో టూవీలర్ ట్రక్ మధ్య భాగంలో ఇరుక్కుపోయింది. ద్విచక్ర వాహనం నుంచి చందన్ పక్కకు పడిన వెంటనే వెనుక ఉన్న మరోయువకుడు పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది. వైట్‌ఫీల్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.