హత్యకేసులో 21 మందికి ఊరట
Published Tue, Jan 28 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి పాంటీ చద్దా, అతని సోదరుడు హర్దీప్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21 మంది నిందితులపై హత్యానేరం కింద నమోదైన అభియోగాలను స్థానిక కోర్టు మంగళవారం రద్దు చేసింది. అయితే మిగతా సెక్షన్లను మాత్రం ఉపసంహరించలేదు. ఉత్తరప్రదేశ్ మైనారిటీల సంఘం అధిపతి సుఖ్‌దేవ్ సింగ్ నామ్‌ధారి కూడా నిందితుల్లో ఒకరు. నామ్‌ధారి, అతని అంగరక్షకుడు సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు మోపింది. దీని కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్షపడే అవకాశముంటుంది.
2012, నవంబర్ 17న ఈ హత్యలు హఠాత్తుగా జరిగి నట్టు అనిపిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హర్దీప్ స్వయంగా పాంటీ, నరేందర్ (పాంటీ మేనేజర్)పై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. దీంతో పాంటీ మరణించగా, నరేందర్‌కు గాయాలయ్యాయి. అందుకే 21 మందిపై హత్యానేరం అభియోగాలను రద్దు చేయడంతోపాటు నామ్‌ధారి, సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేసామన్నారు. మిగతా 19 మందిపై హత్యాయత్నం, అల్లర్లు సృష్టించడం తదితర అభియోగాలు నమోదు చేస్తారు.
Advertisement