Sukhdev Singh
-
కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్
చండీగఢ్: కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ గొగామెడి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు గొగామెడిని కాల్చి చంపిన షూటర్లు. గొగామెడి హత్య కేసులో రోహిత్ రాథోర్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లు, వారి వెంట ఉన్న మరొక వ్యక్తిని శనివారం రాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కర్ణిసేన చీఫ్ గొగామెడిని జైపూర్‌లోని ఆయన ఇంట్లోనే ముగ్గురు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. వీరిలో ఒక దుండగుడు స్పాట్లోనే క్రాస్‌ఫైర్ జరిగి బుల్లెట్ తగిలి చనిపోయాడు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దిరని పోలీసులు తాజాగా పట్టుకున్నారు. హత్య తర్వాత ఇద్దరు షూటర్లు జైపూర్ నుంచి హిస్సార్‌కు రైలులో వెళ్లి అక్కడి నుంచి మనాలీ, మండి మీదుగా చండీగఢ్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నాడు. పరారీలో ఉండి పట్టుబడ్డ ఇద్దరు షూటర్లు ఎప్పటికప్పుడు గోడారాకు టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, కర్ణిసేన చీఫ్ గొగామెడి హత్య రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకే ఆయనపై కాంగ్రెస్ పార్టీ పగ తీర్చుకుందని బీజేపీ ఆరోపించింది. గొగామెడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పెంచాల్సిందిగా కోరినప్పటికీ సీఎం గెహ్లాట్ ఎలాంటి చర్య తీసుకోకపోవడమే ఇందుకు ఆధారమని బీజేపీ నేతలు విమర్శించారు. ఇదీచదవండి..ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు -
కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..!
జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని హతమార్చిన కేసులో ఇద్దరు ముష్కరులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. జైపూర్‌లోని మంగళవారం తన ఇంట్లో టీ తాగుతున్న సమయంలో గోగామేడిని నిందితులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. సమాచారం అందిస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల నజరానాను కూడా ప్రకటించారు. కర్ణిసేన చీఫ్ హత్య రాజస్థాన్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన మద్దతుదారులు ఈరోజు రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రహదారులను దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జైపూర్‌తో పాటు చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ హత్యపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. Rajasthan Karni Sena chief murder accused identified Read @ANI Story | https://t.co/rDleKvcsqS#SukhdevSinghGogaMedi #KarniSena #Rajasthan pic.twitter.com/asUyGXdOkc — ANI Digital (@ani_digital) December 6, 2023 సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు బాధ్యత వహిస్తూ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో దగ్గరి సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్టు చేశాడు. రోహిత్ గోదార గతంలో సుఖ్‌దేవ్ గోదారాను బెదిరించాడు. రోహిత్ గొదారాపై సుఖ్‌దేవ్ సింగ్ ఫిర్యాదు కూడా చేశారని పోలీసులు తెలిపారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో కూడా ఉన్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. #WATCH | Karni Sena members protest in Rajasthan's Jaipur over the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena. pic.twitter.com/IjAOtsYnms — ANI (@ANI) December 6, 2023 ఇదీ చదవండి: Karni Sena Chief Murder Case: రాజస్థాన్ బంద్.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్ -
కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య
జైపూర్: జైపూర్‌లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్‌తో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్ట్‌లో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు -
సిక్కు ప్రముఖులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్‌కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్‌కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్‌సర్‌కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
విజయ సారథులు వీరే
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒక డాక్టర్, ఒక రిటైర్డ్ టీచర్, ఆర్మీలో పని చేసిన వ్యక్తి , ఢిల్లీ పోలీసు మాజీ కానిస్టేబుల్ ఇలా ఎందరో ఉన్నారు. ఏడాది పాటు ఉద్యమాన్ని సజీ వంగా నిలిపి ఉంచడానికి వీరంతా పాటుపడ్డారు. రాకేశ్ తికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై మోశారు. ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అయిన ఆయన కరకు ఖాకీలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపారు. 52 ఏళ్ల వయసున్న తికాయత్ ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిరసనలు చేపడితే కేంద్రం దిగి వస్తుందన్న వ్యూహాన్ని రచించి ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. దర్శన్పాల్ వృత్తిరీత్యా డాక్టర్ అయిన దర్శన్పాల్ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను ఏకం చేశారు. 40 రైతు సంఘాలను ఒకే గూటికి తీసుకువచ్చి కిసాన్ ఏక్తా జిందాబాద్ నినాదంతో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అఖిల భారత సంఘర్‡్ష సమన్వయ కమిటీ సభ్యుడైన దర్శన్ పాల్ పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జోగిందర్ సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు అయిన జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు. రైతు సంఘాల్లో అత్యధికం సింఘూ సరిహద్దుల్లోనే ఉద్యమిస్తే టిక్రీలో ఉద్యమాన్ని జోగిందర్ సింగ్ ఒంటిచేత్తో నడిపించారు. రైతు నిరసనల్లో దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లారు. రైల్ రోకోలు, బీజేపీ నేతల ఘొరావ్లలో జోగిందర్ సింగ్ ఎప్పుడూ ముందుండేవారు. బల్బీర్ సింగ్ రాజేవాల్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు అయిన బల్బీర్ సింగ్ రాజేవాల్ సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడడంలో దిట్ట. 78 ఏళ్ల వయసున్న ఈ రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో చర్చల సమయంలో తమ వాదనల్ని గట్టిగా వినిపించేవారు. అంతేకాదు రైతులు చేయాల్సిన నిరసనలపై బల్బీర్సింగే ప్రణాళికలు రచించి ముందుకి నడిపించారు. సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్ అయిన 71 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ పోలీసులతో ఘర్షణలు జరిగినప్పుడల్లా తానే ముందు ఉండేవారు. ఛలో ఢిల్లీ ఆందోళన సమయంలో పోలీసులకు ఎదురెళ్లి నిలుచున్న సాహసి. బీకేయూ, ఉగ్రహాన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుఖ్‌దేవ్ సహ రైతులకు రక్షణగా ఎప్పుడూ తానే ముందుండేవారు. -
హత్యకేసులో 21 మందికి ఊరట
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి పాంటీ చద్దా, అతని సోదరుడు హర్దీప్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21 మంది నిందితులపై హత్యానేరం కింద నమోదైన అభియోగాలను స్థానిక కోర్టు మంగళవారం రద్దు చేసింది. అయితే మిగతా సెక్షన్లను మాత్రం ఉపసంహరించలేదు. ఉత్తరప్రదేశ్ మైనారిటీల సంఘం అధిపతి సుఖ్‌దేవ్ సింగ్ నామ్ధారి కూడా నిందితుల్లో ఒకరు. నామ్ధారి, అతని అంగరక్షకుడు సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు మోపింది. దీని కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్షపడే అవకాశముంటుంది. 2012, నవంబర్ 17న ఈ హత్యలు హఠాత్తుగా జరిగి నట్టు అనిపిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హర్దీప్ స్వయంగా పాంటీ, నరేందర్ (పాంటీ మేనేజర్)పై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. దీంతో పాంటీ మరణించగా, నరేందర్‌కు గాయాలయ్యాయి. అందుకే 21 మందిపై హత్యానేరం అభియోగాలను రద్దు చేయడంతోపాటు నామ్ధారి, సచిన్ త్యాగిపై ‘హత్యగా పరిగణి ంచలేని శిక్షార్హమైన నరహత్య’ సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేసామన్నారు. మిగతా 19 మందిపై హత్యాయత్నం, అల్లర్లు సృష్టించడం తదితర అభియోగాలు నమోదు చేస్తారు.