మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్ | Sanjay dutt hugs wife maanyata, twins Iqra, Shahraan as he leaves for pune Jail | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్

Published Sat, Sep 26 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్

మళ్లీ జైలుకెళ్లిన మున్నాభాయ్

ముంబై:  బాలీవుడ్ హీరో,  1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష పడిన సంజయ్‌దత్‌ తిరిగి జైలుకు వెళ్లారు.  ముఫ్పై రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన అతడు ఆ గడువు ముగియడంతో జైలు గూటికి చేరుకున్నారు.. 1993 ముంబై పేలుళ్లకు సంబంధించి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన నేరానికిగాను సంజయ్‌ దత్కు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అతడిని దోషిగా నిర్థారించిన సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 1996లో 18 నెలల పాటు శిక్ష అనుభవించిన కాలాన్ని మినహాయించిన కోర్టు మరో 42 నెలల పాటు శిక్ష అనుభవించాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పుణె-ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ గత నెలలో పెరోల్‌పై బయటకు వచ్చారు. ఆ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు.  భార్య మాన్యత, ఇద్దరు కవలలు ఇక్రా, షహరాలు ...సంజయ్ దత్కు వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement