సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, దానికి సంబంధించిన విషయాలను మరింత వివాదాస్పదం చేయడం సరికాదనీ, ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ తన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తుండటంపై ఆవేదన, ఆగ్రహంతో ఆమె ఉత్తరం రాశారు.
‘మన కుటుంబంపై కేంద్రానికి ఇప్పటికే ఓ నివేదిక అందింది. దాని పర్యావసనమే ఐటీ దాడులు. హోంశాఖ తన నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమన్నట్లుగా మీరంతా ఇలానే వ్యవహరిస్తే నేను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత చనిపోయిన వెంటనే ఓ కేంద్ర మంత్రి తనకు ప్రీతిపాత్రమైన వారికి సీఎం పదవి కట్టబెట్టేందుకు యత్నించారని దినకరన్ ఇంతకుముందు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హోంశాఖ.. వెంకయ్య నాయుడే సదరు వ్యక్తి అని కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా శశికళ ఉత్తరం అందుకోవడం వల్లే కొత్త పార్టీ ఏర్పాటుపై దినకరన్ వెనక్కుతగ్గారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment