చెన్నై: అదృశ్యమైన ఏఎన్ 32 విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కోస్ట్గార్డ్ ఐజీ రాజన్ తెలిపారు. శనివారం చెన్నైలో ఆయన మాట్లాడుతూ...అండమాన్కు 144 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విమానం పడిపోయి ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సదరు విమానం కోసం జలాంతర్గామి, 12 నౌకలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు రాజన్ బర్కోత్రా వివరించారు.
చెన్నై సమీపంలోని తాంబరం ఏయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ఏఎన్ - 32 విమానం శుక్రవారం పోర్ట్బ్లెయిర్కు బయలుదేరింది. సదరు విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే దీనిపై సమీక్ష నిర్వహించేందుకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం తాంబరం ఏయిర్ఫోర్స్ స్టేషన్ చేరుకున్నారు. గల్లంతైన ఏఎన్ 32 విమానంలో 8 మంది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే.
'గాలింపు చర్యలు ముమ్మరం చేశాం'
Published Sat, Jul 23 2016 12:20 PM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM
Advertisement
Advertisement