స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీ సులు. ఎమ్‌జీ రోడ్‌లో ఉన్న డీటీ సెంటర్‌లో ఐదుగురు మహిళలతోపాటు,
సెక్స్ రాకెట్ గుట్టురట్టు
Published Thu, Apr 24 2014 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
గుర్గావ్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీ సులు. ఎమ్‌జీ రోడ్‌లో ఉన్న డీటీ సెంటర్‌లో ఐదుగురు మహిళలతోపాటు, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ దల్బీర్ సింగ్ కథనం ప్రకారం... డీటీ సిటీ సెంటర్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఓ స్పా అండ్ మసాజ్ సెంటర్‌కి ఓ వ్యక్తిని పంపారు పోలీసులు. 5 వేల రూపాయలు చెల్లిం చినవెంటనే అతనికి ఓ మహిళను కేటాయిం చారు నిర్వాహకులు. అతను అందించిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్ లోపలికి ప్రవేశించిన పోలీ సులు ఐదుగురు మహిళలతోపాటు, మరో కస్టమర్‌ను పట్టుకున్నారు. ఆ పార్లర్ ఢిల్లీకి చెందిన మహిళా వ్యాపార వేత్తదని పోలీసులు తెలిపారు. ఐదుగురు మహిళలు మణిపూర్, నాగాలాండ్ కు చెందినవారు కాగా... కస్టమర్ గుర్గావ్ వాసిగా గుర్తించినట్టు చెప్పారు.
ఎక్సైజ్ అధికారి భార్య హస్తం...
ఈ రాకెట్ వెనుక ఉన్న మహిళా వ్యాపారవేత్తను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ట్యాక్సేషన్ అధికారి భార్య కాంతాశర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. సెక్టార్ 29లోని పోలీస్ స్టేషన్ సందీ ప్ కుమార్ అందించిన వివరాల ప్రకారం... మెహ్రౌలీ-గుర్గావ్ రహదారిపైగా డీటీ సిటీ సెం టర్‌మాల్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఈ స్పా కాంతాశర్మ నిర్వహిస్తున్నారని చెప్పారు.
Advertisement
Advertisement