హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
త్వరలో బాధ్యతల స్వీకరణ
మదురై ధర్మాసనానికి సీఐఎస్‌ఎఫ్ భద్రత
ఆ న్యాయమూర్తిపై చర్యలు తప్పవు
సీజే వ్యాఖ్య
సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టులో ఖాళీల భర్తీకి కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. అయితే, ఆరుగుర్ని మాత్రమే నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు. మదురై ధర్మాసనానికి సీఐఎస్‌ఎఫ్ భద్ర త కల్పించేందుకు తగ్గ పరిశీలనకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, మదురై మేలూరు ధ ర్మాసనం న్యాయమూర్తి మహేంద్ర భూ పతిపై చర్యలు తప్పవని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిధిలో న్యాయమూర్తుల సంఖ్య 75 ఉండాల్సి ఉంది. అయితే, 34 మంది మాత్రమే ఉ న్నారు. 41 పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులకు పని భారం ఎక్కువే. ఈ పరిస్థితుల్లో మరో రెండు మూడు నెలల్లో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య మ రింతగా పెరగడం ఖాయం. ఖాళీల భర్తీ ని మిత్తం తొమ్మిది మందితో కూడిన జాబితాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సిఫారసు చేశారు.
ఇందులో ఆరుగురు సీనియర్ న్యాయవాదులు, ముగ్గురు జి ల్లా జడ్జిలు ఉన్నారు. అయితే, ఈ జాబితా మీద వ్యతిరేకత బయలు దేరడం, తదుపరి మార్పులు చేర్పులు సాగి, చివరకు సుప్రీం కోర్టు, కేంద్ర న్యాయ శాఖ ఆరుగురి నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఇందులో నలుగురు సీనియర్ న్యాయవాదులు, ఇద్దరు జిల్లా జడ్జీలు ఉన్నారు. న్యాయవాదుల్లో భారతీదాసన్, ఎస్‌ఎస్ సుందర్, ఎంవీమురళీ ధర్, కృ ష్ణకుమార్ త్వరలో న్యాయమూర్తులుగా పదవులు చేపట్టబోతున్నారు.
అలాగే, జిల్లా జడ్జిగా ఉన్న గోకుల్ దా సు, హైకోర్టు రిజిస్టార్ హో దాతో ఉన్న పొన్ కలైయరసన్‌లు ఉన్నారు. అయితే, గోకుల్ దాసు జిల్లా జడ్జిగా మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందనున్నడం గమనార్హం. హైకోర్టు న్యాయమూర్తులుగా ఈ ఆరుగురి నియామకం ఇక లాంఛనమే. ఈ ఆరుగురి సంతకాల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి దరఖాస్తులు హైకోర్టుకు వచ్చి చేరాయి. సంతకాల అనంతరం బుధవారం రాష్ర్టపతి భవన్‌కు పంపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తరువాయి, ఈ ఆరుగురు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
మదురై ధర్మాసనంకు భద్రత:
మద్రాసు హైకోర్టుకు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) భద్రత గత ఏడాది కల్పించిన విషయం తెలిసిందే. ఇదే భద్రతను మదురై ధర్మాసనంకు కూడా కల్పించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.సుమోటోగా కేసును స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ అందుకు తగ్గ పరిశీలనకు ఆదేశించింది. బుధవారం ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ చేస్తూ, ఏప్రిల్ ఐదో తేదిన న్యాయమూర్తి నేతృత్వంలో నియమిం చిన భద్రతా కమిటీ సమావేశం కావాలని, మదురై ధర్మాసనంలో సీఐఎస్‌ఎఫ్ భద్రత ఏర్పాట్లకు తగ్గ పరిశీలన చేపట్టాలని సూచించారు.
అలాగే, సీఐఎస్‌ఎఫ్ భద్రతకు గాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిం చాల్సిన మొత్తం ఇంకా అందని దృష్ట్యా, అందుకు తగ్గ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో భద్రతా కమిటీ నేతృత్వంలో ఐదో తేదీ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టి ఉన్నారు. ఇందులో ఆ కమిటీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, సీఐఎస్‌ఎఫ్ వర్గాలు పాల్గొననున్నాయి.
చర్యలు తప్పవు:
గ్రానైట్ స్కాం నిందితులు పిఆర్ పళని స్వామి, సహాదేవన్‌లను ఓ కేసు నుంచి విడుదల చేస్తూ మదురై జిల్లా మేలూరు కోర్టు న్యాయమూర్తి మహేంద్ర భూపతి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హై కోర్టు పర్యవేక్షణలో గ్రానైట్ స్కాం విచారణ సాగుతున్న సమయంలో ఆ న్యాయమూర్తి తీర్పు చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఆ న్యాయమూర్తిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో,తాజా తీర్పు వ్యవహారం హైకోర్టుకు చేరింది. కృష్ణమూర్తి అనే న్యాయవాది తాజా తీర్పు వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి సం జయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే మదురై ధర్మాసనం నుంచి ఆ న్యాయమూర్తిపై చర్యకు సిఫారసులు వచ్చినట్టు, అందుకు తగ్గ ప్రక్రియ ముగియగానే చర్యలు తప్పదని సీజే వ్యాఖ్యానించడం విశేషం.
ఆరుగురే..
Published Thu, Mar 31 2016 1:40 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement