ఇంకా నిర్ణయించలేదు: గడ్కారీ | Still can not decide: Gadkari | Sakshi
Sakshi News home page

ఇంకా నిర్ణయించలేదు: గడ్కారీ

Published Thu, Oct 17 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Still can not decide: Gadkari

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై తమ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీజేపీ సీనియర్  నాయకుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశా రు.  ఢిల్లీ బీజే పీ అధ్యక్షుడు విజయ్ గోయల్‌ను పక్కనబెట్టి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ అయిన నితిన్ గడ్కారీ పైవిధంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ ఏ నేతనూ ఎంపిక చేయలేదన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
 విజయ్‌గోయల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన ఎని మిది నెలల పదవీకాలంలోనే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. పార్టీ సీనియర్ నేతలు  గోయల్ పనితీరుపట్ల తమ అసంతృప్తిని పలుమార్లు అధిష్టానం వద్ద వ్యక్తం చే శారు. ఢిల్లీ బీజేపీలో  నె లకొన్న అసమ్మతి వల్ల ఎన్నికలు సమీపిస్తున్నా అధికార కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చే శక్తిగా ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని వారు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వంటి మహా నగరాలలో పార్టీకి నేతృత్వం వహించే వ్యక్తి ప్రతిష్ట అన్నింటికంటే ముఖ్యమని, గోయల్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపడంలో విఫలమయ్యారని తెలిపారు. 
 
 గోయల్‌ను విభజిం చు, పాలించు సూత్రాన్ని పాటిస్తూ పార్టీ కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షీలా సర్కార్ పాలనకు చరమగీతం పాడాలంటే హర్షవర్ధన్ లాంటి నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని అభ్యర్థించా రు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో  విజయ్‌గోయల్ ప్రయోగం విఫలమైందని గుర్తించిన బీజేపీ అధిష్టానం హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్టిగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చిందని వార్త లు వచ్చాయి. అయితే ఈ ఊహగానాలకు తెరదించుతూ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని గడ్కారీ చేసిన వ్యాఖ్యలు మరో రకమైన వాదనకు తెరలేపాయి. 
 
 భారీ సంఖ్యలో నాయకులకు ఆమోదయోగ్యుడిగా ఉండటంతో పాటు మిస్టర్ క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న హర్షవర్ధన్ అవకాశాలకు పార్టీ కేంద్ర నాయకత్వం తెరదించినట్టయిందని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత సీఎం అభ్యర్థిని పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement