లడఖ్‌లో బేస్‌క్యాంప్‌లో శిక్షణకు ఎంపికైన విద్యార్థులు
సీతంపేట: మరో నెలన్నర రోజులలో గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలకు చెందిన ముగ్గురు మన్యం విద్యార్థులు మన ఎవరెస్టు పర్వతారోహణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని గిరిజన గురుకుల కళాశాలల నుంచి 16 మంది ఎంపికవ్వగా అందులో సీతంపేట బాలికల కళాశాల విద్యార్థిని కొండగొర్రె రేణుక, బాలుర కళాశాల విద్యార్థులు ఎస్.రాజ్‌కుమార్, రమణమూర్తిలు ఉన్నారు. డిసెంబర్‌లో రీనాక్ పర్వతారోహణ చేసి సత్తాచాటిన గిరిజన విద్యార్థులు ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎవరెస్టు దారిలో కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. అత్యున్నత ఎవరెస్టు అధిరోహణలో తొలి అంకాన్ని పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల నెల రోజులపాటు లడఖ్‌లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణ పొందారు. మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయిన అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించనున్నారు. ఎస్.రాజ్‌కుమార్ సీతంపేట గిరిజన బాలుర కళాశాలలో హెచ్‌ఈసీ, జె.రమణమూర్తి సీజీఏ(వృత్తివిద్యా కోర్సు), రేణుక సీతంపేట బాలికల గిరిజన గురుకుల కళాశాలలో ఏఅండ్‌టీ కోర్సు చదువుతున్నారు.
ఎవరెస్టు దారి ఇదీ..
తొలుత పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉన్న 6,400 మీటర్ల రీనాక్ పర్వతమెక్కి విజయబావుట ఎగురవేశారు. కొద్ది నెలల కిందట రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఎవరెస్టు పర్వతారోహణలో భాగంగా రీనాక్ శిఖరం పైకి బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది గిరిజన విద్యార్థులకు గాను 20 మంది బాలురు, 7 బాలికలకు విజయవాడ కేతాని కొండ వద్ద పర్వతోరాహణపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 22 మంది రీనాక్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. వారిలో 16 మంది విద్యార్థులను ఎంపిక చేసి జనవరి 1 నుంచి తూర్పుగోదావరి జిల్లా చింతూరలో 23 రోజుల పాటు ఎవరెస్టు అధిరోహణ శిక్షణ పొందారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి1 వరకు లడక్ సమీపంలో మార్కావేలి మంచుపర్వత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment