అప్పన్న సేవలో సుప్రీం న్యాయమూర్తులు
Published Sat, Jan 21 2017 4:22 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM
విశాఖపట్నం: విశాఖ జిల్లా సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన్నను శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావు నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తులకు వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement