అన్న అడుగుజాడల్లో కార్తీ | Surya, Karthi separate production companies are now starting pictures | Sakshi
Sakshi News home page

అన్న అడుగుజాడల్లో కార్తీ

Published Mon, Aug 17 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

అన్న అడుగుజాడల్లో కార్తీ

అన్న అడుగుజాడల్లో కార్తీ

 తమ్ముడికి అన్న మార్గదర్శకుడయ్యాడు. అందుకే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తున్నారు. ఇంతకీ ఈ ఆదర్శ సోదరులెవరన్నదేగా మీ ఉత్సుకత. అక్కడికే వస్తున్నా. కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకులుగా వెలుగొందుతున్న సోదర ద్వయం ఎవరంటే టక్కున వచ్చే సమాధానం సూర్య, కార్తీలనే. నటులుగా సొంతంగా ఎదిగిన వీరు ఇప్పుడు నిర్మాతలుగానూ రాణించడానికి సిద్ధం అయ్యారు. ఇంతకు ముందు వరకూ ఉమ్మడి చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో చిత్రాలు చేస్తూ వచ్చిన సూర్య, కార్తీ ఇప్పుడు విడివిడిగా నిర్మాణ సంస్థలను ప్రారంభించి చిత్రాలు చేస్తున్నారు.
 
 సూర్య ఇప్పటికే తన పిల్లల పేర్ల తొలి అక్షరాలు కలిసేలా(దియా,దేవ్) 2డీ పిక్చర్స్ బ్యానర్‌ను ప్రారంభించి తన భార్యా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు.ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో తాను నటిస్తున్న ఐక్యూ, 24 చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా నిర్మాతగా అన్నయ్య సక్సెస్ అవడంతో తమ్ముడు కార్తీ కూడా ఆయన అడుగు జాడల్లో నడవడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఫ్రిన్స్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టి కాష్మోరా చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు.మరి నిర్మాతగా కార్తీ ఏ స్థాయిలో విజయం సాధిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement