studio green
-
ఒకే వేదికపై నాలుగు వేడుకలు
ఒకే వేదికపై నాలుగు చిత్రాల వేడుకలు జరగడం అరుదైన విషయమే అవుతుంది. అదీ ఒకే నిర్మాత చేస్తున్న చిత్రాలు కావడం మరో విశేషం. అలాంటి వేడుకలకు బుధవారం సాయంత్రం చెన్నై, వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్ వేదికైంది. స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజానే ఈ అరుదైన వేడుకలను నిర్వహించారు. ఆయన నిర్మించిన భారీ చిత్రం తానాసేర్నదకూట్టం. సూర్య, కీర్తీసురేశ్ జంటగా నటించిన ఇందులో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. గత వారం తెరపైకి వచ్చిన తానాసేర్నదకూట్టం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. అదే వేదికపై నటి అనుష్క టైటిల్ పాత్ర పోషించిన ద్విభాషా చిత్రం భాగమతి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్ర తమిళ హక్కులను జ్ఞానవేల్ రాజా దక్కించుకున్నారు. ఇలాఉండగా జ్ఞానవేల్ రాజా తాజాగా ఆర్య, సాయేషాసైగల్ జంటగా గజనీ కాంత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్.పీ జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలమురళీబాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం రెండవ సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే వేదికపై ఆవిష్కరించారు. ఒక జ్ఞానవేల్‌రాజాకు చెందిన మరో నిర్మాణ సంస్థ బ్లూ గోస్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు. గౌతమ్‌కార్తీక్, వైభవి శాండిల్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ పీ.జయకుమార్ దర్శకుడు. ఈ చిత్ర సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం ఇదే వేదికపై జరిగింది. నాలుగు చిత్రాల తారలు, సాంకేతిక వర్గంతో వేదిక కళ కళలాడింది. వీటిలో నటి అనుష్క నటించిన భాగమతి చిత్రం ఈ నెల 26వ విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
‘కాట్టేరి’కి శ్రీకారం చుట్టారు
కాట్టేరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. సూర్య కథానాయకుడిగా తానాసేర్న్‌ద కూట్టం, ఆర్య హీరోగా గజనీకాంత్ చిత్రాలను నిర్మిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం కాట్టేరి. వైభవ్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కరుణాకరన్, మొట్టై రాజేంద్రన్, పొన్నంబళం, యూట్యూబ్ ఫేమ్ సారా ముఖ్యపాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను డీకే నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు యామిరుక్క భయమే వంటి కామెడీ హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని కూడా అదే బ్యానర్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంగీతాన్ని ప్రసాద్, ఛాయాగ్రహణం విక్కీ అందిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ఈ చిత్రం ప్రారంభమైంది. చెన్నైలోని స్టూడియో గ్రీన్ సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా పారంభమైన ఈ కార్యక్రమానికి దర్శకుడు కేవీ.ఆనంద్, పుష్కర్ గాయత్రి ద్వయం, ఆధిక్ రవిచంద్రన్, నటుడు జీవా, చిత్ర హీరో వైభవ్, కరుణాకరన్, మొట్ట రాజేంద్రన్, సీవీ.కుమార్, శక్తివేలన్, నటి వీజే.రమ్య, నాక్ స్టూడియోస్ అరుణ్ పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో వైభవ్‌కు జంటగా ఓ ప్రముఖ నటి కోసం చర్చలు జరుగుతున్నాయని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సంస్థలో సూర్య హీరోగా నిర్మాణం అవుతున్న తానాసేర్న్‌ద కూట్టం చిత్రం చిత్రీకరణను పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటూ జనవరిలో పొంగల్ సంబరాలకు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
అన్న అడుగుజాడల్లో కార్తీ
-
అన్న అడుగుజాడల్లో కార్తీ
తమ్ముడికి అన్న మార్గదర్శకుడయ్యాడు. అందుకే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తున్నారు. ఇంతకీ ఈ ఆదర్శ సోదరులెవరన్నదేగా మీ ఉత్సుకత. అక్కడికే వస్తున్నా. కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకులుగా వెలుగొందుతున్న సోదర ద్వయం ఎవరంటే టక్కున వచ్చే సమాధానం సూర్య, కార్తీలనే. నటులుగా సొంతంగా ఎదిగిన వీరు ఇప్పుడు నిర్మాతలుగానూ రాణించడానికి సిద్ధం అయ్యారు. ఇంతకు ముందు వరకూ ఉమ్మడి చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో చిత్రాలు చేస్తూ వచ్చిన సూర్య, కార్తీ ఇప్పుడు విడివిడిగా నిర్మాణ సంస్థలను ప్రారంభించి చిత్రాలు చేస్తున్నారు. సూర్య ఇప్పటికే తన పిల్లల పేర్ల తొలి అక్షరాలు కలిసేలా(దియా,దేవ్) 2డీ పిక్చర్స్ బ్యానర్‌ను ప్రారంభించి తన భార్యా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు.ప్రస్తుతం ఇదే బ్యానర్లో తాను నటిస్తున్న ఐక్యూ, 24 చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా నిర్మాతగా అన్నయ్య సక్సెస్ అవడంతో తమ్ముడు కార్తీ కూడా ఆయన అడుగు జాడల్లో నడవడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఫ్రిన్స్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టి కాష్మోరా చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు.మరి నిర్మాతగా కార్తీ ఏ స్థాయిలో విజయం సాధిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
సూర్య జోక్యం చేసుకుంటే...
సూర్య వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్ర కథపై సూర్య జోక్యం చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న విషయం దర్శకుడు వెంకట్ ప్రభు భయానికి గురి చేస్తోందట. దీనికి కారణాలు లేకపోలేదు. అజిత్ హీరోగా మంగాత్తా, కార్తీ హీరోగా బిరియాని చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలో తనమునకలైన వెంకట్ ప్రభు ఎట్టకేలకు కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. సాధారణంగా స్క్రిప్ట్ విషయంలో చాలా సమయం తీసుకునే వెంకట్ ప్రభు సూర్య కోసం తక్కువ సమయంలోనే కథ సిద్ధం చేశారు. ఈ విషయం సూర్య చెవిన వేయగా వెంటనే షూటింగ్‌కు రెడీ అవ్వమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం అంజాన్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న సూర్య, వెంకట్ ప్రభు నుంచి సింగిల్ లైన్ స్క్రిప్ట్‌ను విన్నారట. పూర్తి కథను వినలేదట. కథ పూర్తిగా విన్న తరువాత ఆయన జోక్యం చేసుకుని ఎలాంటి మార్పులు చేయమంటారోనని వెంకట్ ప్రభు భయపడుతున్నారట. ఆయన భ యానికి కారణం ఇంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిన సూర్య ఆ తరువాత ఆయన పూర్తి కథ సిద్ధం చేయలేదంటూ వైదొలిగారు. అలాగే వెంకట్ ప్రభు కథ బాగాలేదంటారేమోనని ఆయన భయపడుతున్నారట. ఈ చిత్రం జూన్ లో సెట్‌పైకి వెళ్లనుందట.