మంత్రి అయ‍్యన‍్నపాత్రుడికి అస్వస్థత
తిరుపతి: ఏపీమంత్రి అయ్యన్నపాత్రుడు అస్వస్థతకు గురయ్యారు. తన మనవడి పుట‍్టెంట్రుకలు తీసే కార‍్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో తిరుపతి వచ్చారు. గురువారం ఉదయం ఆయన శ‍్వాసతీసుకోవడంలో ఇబ‍్బందిపడ్డారు. దీంతో మంత్రిని కుటుంబసభ‍్యులు హుటాహుటిన రుయా ఆస‍్పత్రికి తరలించారు. అక‍్కడ వైద్యులు వైద‍్య పరీక్షలు నిర‍్వహించారు. ప్రస్తుతం మంత్రి ఆస‍్పత్రిలో కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు.