minister Ayyanna Patrudu
-
కాంగ్రెస్‌తో టీడీపీ కలవడమేంటి?
-
మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న చిందులు
-
జగన్‌కు సమస్యలు చేప్పుకున్న అయ్యన్న పాత్రుడి దత్తత గ్రామ ప్రజలు
-
బీజేపీ మెజార్టీ బాగా తగ్గిపోతుంది..
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రతిష్ట బాగా దెబ్బతింటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఆ పార్టీకి మెజార్టీ కూడా బాగా తగ్గిపోతుందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆ పార్టీ గెలిచే అవకాశాలున్నా 2014లో వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెబితేనే దానికి అంగీకరించామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు. ప్రత్యేక హోదాతోపాటు మిగిలిన 18 అంశాలను సాధించడమే లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ నాయకులు రోడ్లపై తిరగలేరు : బుద్ధా వెంకన్న రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మాపై చులకనగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ నాయకులు వారి నియోజకవర్గాల్లో కూడా తిరగలేరని, రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా మాట్లాడారు. -
అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో దోపిడీ!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో భారీ దోపిడీ జరుగుతోందని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో లంచాలను తీసుకుంటున్నారన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయిస్తూనే వారికి పూర్తిస్థాయిలో జీతభత్యాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కమీషన్ పేరుతో మూడోవంతు కష్టార్జితాన్ని అప్పనంగా దోచేస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ సమక్షంలోనే ఈ పోస్టుల భర్తీ జరిగితే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అవినీతికి పాల్పడే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. -
విశాఖకు మచ్చ తెచ్చిందెవరు?
♦ జిల్లాను చెరబట్టిన పచ్చ నేతలు ♦ మూడేళ్లలో రూ. వేల కోట్ల భూకుంభకోణాలు ♦ పరువు తీసేసిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ♦ మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు, సిట్‌కు ఇచ్చిన ఆధారాలే సాక్ష్యం ♦ భూ దందాలే కాదు.. మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాగా మారిన దేశం నేతలు ♦ ఎక్కడ చూసినా టీడీపీ నేతల సెటిల్మెంట్లే ♦ మూడేళ్ల కిందట ఎన్నికల వేళ వైఎస్సార్సీపీపై కుట్రలు ♦ కడప నేతలొస్తే భూ దందాలు పెచ్చుమీరుతాయని విషప్రచారం ♦ మరి ఇప్పుడు టీడీపీ పాలనలో జరిగిందేమిటి? ♦ అన్ని వర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే చర్చ 2014 ఎన్నికల వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులపై ఓ పథకం ప్రకారం విష ప్రచారం.. ప్రత్యేకించి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్న విశాఖలో అడ్డూఅదుపూ లేకుండా తప్పుడు ప్రచారాలు.. కడప నేతలొస్తే.. బయట జిల్లాల నాయకులొస్తే విశాఖ తీరం కలుషితమైపోతుందని.. భూకబ్జాలకు నిలయమైపోతుందని విషపు రాతలు, విపరీత వాదనలు, దుష్ప్రచారాలతో టీడీపీ ఎన్నికల ప్రచారం మోతెక్కిపోయింది. ఎక్కడ చూసినా ఇదే రీతిలో విష ప్రచారానికి తెగబడ్డారు. వలస నేతలతో విశాఖ ప్రతిష్టకు మచ్చ వస్తుందని లేని భయం నటించారు.. టీడీపీ నేతలతో అంటకాగిన బీజేపీ నేతలూ ఇలాంటి భయాలే రేపారు. మరి వర్తమానంలో ఏం జరుగుతోంది.. చూద్దాం రండి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో ఏం జరుగుతోంది?.. మూడేళ్లుగా ఏం ఒరిగింది??.. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా విస్పష్టంగా ప్రకటించేశారు. 2014 నుంచే విశాఖ భూ కబ్జాలకు, కుంభకోణాలకు కేంద్రంగా మారిందని కుండ బద్ధలుకొట్టారు. భూ కుంభకోణాలపై విచారణకు నియమించిన సిట్‌కు స్వయంగా ఓ ప్రజాప్రతినిధి.. అందునా సీనియర్ మంత్రి అయ్యన్న వెళ్లడమే ఓ సంచలమైతే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే భూ కుంభకోణాలకు తెగబడ్డారని సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయడం విశాఖలో జరిగిన.. జరుగుతున్న దారుణాలకు అద్దం పట్టింది. ఆధారాలతో సహా.. వివిధ ప్రాజెక్టుల పేరిట చేసిన భూసేకరణల్లో సైతం పరిహారాల సాకుతో టీడీపీ నేతలు కోట్లు మింగేశారని స్వయంగా మంత్రే మీడియాకు వెల్లడించారు. మెడ్‌టెక్ భూ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి పక్కా ఆధారాలను కూడా సిట్‌కు అందించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మిన దురాగతాలను సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. మరో దఫా సిట్‌ను కలిసి మరిన్ని భూ కుంభకోణాలను బయటపెడతాననీ ప్రకటించారు. ఇక టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సైతం ఇదే తరహా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈనెల 18న సిట్‌ను కలిసి తన వద్దనున్న ఆధారాలను సమర్పిస్తామని ఆయన చెప్పారు. బహిరంగంగా చెప్పకపోయినా విష్ణుకుమార్‌రాజు కూడా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల ఆగడాలపైనే సిట్‌కు ఫిర్యాదు చేయనున్నారనేది బహిరంగ రహస్యం. ఆరోపణల ఉచ్చులో జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సహజంగా అధికార పార్టీ నేతలపై విపక్షాలు ఆరోపణలు చేయడం, విమర్శలకు దిగడం సహజమే. కానీ ఇంత తీవ్రస్థాయిలో అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు కూరుకుపోవడంపై ప్రజల్లో ఏవగింపు మొదలైంది. భూ కుంభకోణాల్లో ప్రధానంగా వినిపిస్తున్నది భీమిలి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరే. గంటా అండ్ కోపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు స్వయంగా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నవే. వుడా ల్యాండ్ పూలింగ్ కుంభకోణం, భూదందాలు, ప్రభుత్వ భూములు తనఖాపెట్టి కోట్ల రుణం తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టడం.. ఇలా ఆరోపణల ఊబిలో గంటా గ్యాంగ్ కూరుకుపోయిందనే చెప్పాలి. ♦ మంత్రి అయ్యన్నపాత్రుడిపై భూ దందా ఆరోపణలు లేనప్పటికీ.. లేటరైట్ గనుల అక్రమ తవ్వకాలు, ఆర్ అండ్ బీ కాంట్రాక్టులను బినామీల పేరిట చేజిక్కించుకోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ♦ నోరు తెరిస్తే తాను నిజాయితీకి మారుపేరని చెప్పుకునే మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూడేళ్లలో అవినీతి ఆరోపణలు మూటకట్టుకున్నారు. ముదపాక భూముల మాయాజాలంతో పాటు ఆయన తనయుడి వసూళ్లు, క్వారీలు, ఇసుక మాఫియా నుంచి మామూళ్లు, సెటిల్మెంట్లతో అప్రతిష్ట పాలయ్యారు. పైగా నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ బండ బూతల బండారుగా పేరు తెచ్చుకున్నారు. ♦ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మెడ్‌టెక్ భూముల పరిహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరుల పేరిట కోట్లు నొక్కేశారన్న విమర్శలు న్నాయి. ♦ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు వక్ఫ్ భూములను కాజేశారన్న ఆరోపణలతో పాటు లెక్కకు మించిన దందాలతో అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ♦ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీఆర్ గణబాబుపైనా ఘనంగానే ఆరోపణలు ఉన్నాయి. గణబాబు అండతో ఆయన అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మద్యం మాఫియాలో కీలకంగా ఉండటంతో పాటు నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు, పంచాయితీలతో నిత్యం అంటకాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ♦ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ దందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారీఎత్తున సెటిల్మెంట్లు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, ఎవరైనా అడ్డుకుంటే రౌడీయిజానికి పాల్పడం ఆయన ఇలాకాలో నిత్యకృత్యాలే. ♦ యలమంచిలి ఎమ్మెల్యే, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు కూడా తక్కువేమీ తినలేదు. నియోజకవర్గంలో ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో పాటు భూ వివాదాల్లో కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్రాజుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అడ్డగోలు మైనింగ్ కింగ్ అంటే ఎవరైనా ఆయన పేరే చెబుతారు. ♦ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ కోసమే ఆయన పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. –ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై లెక్కకు మించిన ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇలా ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. వీరి అండతో అనుచరులు, జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో దోపిడీలకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ♦ మూడేళ్లలో వీరంతా కలిసి జిల్లాకు ఏం చేశారంటే ఒక్కరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.. కానీ జిల్లా ప్రతిష్టను దెబ్బతీసే విషయంలో మాత్రం ఒకరికొకరు పోటీ పడ్డారనే చెప్పాలి. -
గంటాతో విభేదాలపై అయ్యన్నపాత్రుడి స్పందన!
అమరావతి: విశాఖపట్నంలో భూకుంభకోణాల విషయమై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుతో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న కథనాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి గంటాతో తనకు విభేదాలు లేవని ఆయన గురువారం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు పేర్కొన్నారో తెలియదని అన్నారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట తగ్గడం కాదు పెరిగిందని చెప్పారు. విశాఖపట్నంలో వేల ఎకరాల భూమి కబ్జా అయిన మాట వాస్తవమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్టు గుర్తుచేశారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని, మంత్రి గంటా కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం చంద్రబాబు ఈ వ్యవహారం సిట్ విచారణకు ఆదేశించారని అన్నారు. -
మంత్రి అయ్యన్నపాత్రుడికి అస్వస్థత
తిరుపతి: ఏపీమంత్రి అయ్యన్నపాత్రుడు అస్వస్థతకు గురయ్యారు. తన మనవడి పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో తిరుపతి వచ్చారు. గురువారం ఉదయం ఆయన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో మంత్రిని కుటుంబసభ్యులు హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం మంత్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. -
‘బీజేపీ నేతలకు అవగాహన లేదు’
విజయవాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి మోదీ నిలబెట్టుకోవాలని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని రాష్ట్రంలోని ఎన్నికల సభల్లో మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రాజధాని కోసం అంత డబ్బు ఎందుకుని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. వారి మాటలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అయ్యన్న కొట్టిపారేశారు. హామీలను అమలు చేయాలని కోరుతూ పలుమార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారని చెప్పారు. -
ఏపీలో నీటి ఎద్దడి నివారణకు రూ.158 కోట్లు
హైదరాబాద్ : కరువు ప్రాంతాల్లో ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసిందని గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటికే రూ.60 కోట్లు జిల్లాలకు విడుదల చేశామన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13 జిల్లాలోనూ కరువు తాండవిస్తోందని, గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. బోర్లు ఎండిన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, గత ఏడాది ఇదే సమయంలో 3800 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టగా, ఈ ఏడాది ఇప్పుడు 708 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతుందన్నారు. మే నెలలో గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పశువులకు తాగునీటి అవసరాల కోసమే 114 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో మంచి నీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లకు ఆదేశాలు జారీ చేశామని, ప్రతి గ్రామంలో అదనంగా మజ్జిగ పంపిణీకి జిల్లాకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. బోర్ల మరమ్మత్తులకు ఏడు కోట్లు కేటాయించామన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో మంచినీటి పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని విషయం ప్రస్తావించగా, ముగిసిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించామని, నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు. శాఖకు రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉంది తన మంత్రిత్వ శాఖకు మూడు నెలల కాలంలోనే రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. మూడు నెలల కిత్రం జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అవార్డులు దక్కాయని, ఈ నెల 24న ప్రధాని చేతుల మీదుగా పంచాయతీల అభివృద్దిపై మరో అవార్డు అందుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మరో 11 కేంద్ర అవార్డులు దక్కాయన్నారు. ఈ ఆర్థిక ఏడాది గ్రామాల్లో 5000 కి.మీ అంతర్గత సిమెంట్ రోడ్లు, మరో ఐదు వేల కి.మీల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కష్ణా పుష్కరాల సందర్భంగా రూ.140 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలిపినట్టు మంత్రి వివరించారు. జగన్ అంటే ఇలా.. బాబు అంటే అలా! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం ఎమ్మెల్యేలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబే అక్కడి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను డబ్బులకు కోనుగోలు చేసిందని అన్నారని గుర్తుచేయగా, ‘రాజకీయాల గురించి ఇప్పుడెందుకు? అభివృద్ది గురించి మాట్లాడుకుందాం' అంటూ జవాబు దాటవేశారు. -
ఇక తాడో పేడో..!
పరాకాష్టకు చేరిన అయ్యన్న-గంటా విభేదాలు కొణతాల, గండి చేరికకు చంద్రబాబు ఓకే పట్టుబట్టి సాధించిన మంత్రి అయ్యన్న తాజా పరిణామాలతో రగిలిపోతున్న గంటా వర్గం భగ్గుమంటున్న బండారు, పీలా అనూహ్య పరిణామాల దిశగా జిల్లా టీడీపీ రాజకీయాలు విశాఖపట్నం జిల్లా టీడీపీ విభేదాల కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మంత్రి గంటా వర్గం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. సంక్రాంతి తరువాత ముహూర్తమని మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. దీనిపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా గంటా వర్గానికి సీఎం చంద్రబాబు తేరుకోలేని దెబ్బకొట్టారు. తాజా పరిణామాలపై గంటా వర్గం రగిలిపోతోంది. భగ్గుమన్న ఎమ్మెల్యే బండారు ఫోన్ స్విచ్ఛాప్ చేసేసి భవిష్యత్ నిర్ణయంపై సంకేతాలు ఇచ్చారు. సందిగ్ధంలో పడిన ఎమ్మెల్యే పీలా తీవ్ర నిర్ణయం దిశగా సమాచాలోచనలు జరుపుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి గంటావర్గం సమాయత్తమవుతోంది. గంటాకు అయ్యన్న షాక్ జిల్లా టీడీపీపై ఆధిపత్య పోరులో మంత్రి అయ్యన్నపాత్రుడు పైచేయి సాధించారు. టీడీపీలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు మార్గం సుగమం చేశారు. వారిద్దరు మంగళవారం చంద్రబాబుతో భేటీ కావడంతో గంటా వర్గం షాక్‌కు గురైంది. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్‌లోనే ఉన్న గంటాతోపాటు పెందుర్తి, అనకాపల్లి, గాజువాక, చోడవరం, యలమంచిలి ఎమ్మెల్యేలకు దీనిపై కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. సంక్రాంతి తరువాత కొణతాల, గండి బాబ్జీలు టీడీపీలో చేరుతారని చంద్రబాబుతో భేటీ అనంతరం మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. గంటా వర్గాన్ని దెబ్బతీసేందుకే కొణతాల, గండి బాబ్జీలను అయ్యన్న పట్టుబట్టి టీడీపీలోకి తీసుకువస్తున్నారన్నది స్పష్టమైంది. వారిద్దరూ టీడీపీలో చేరతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయ్యన్న ఏకంగా పెందుర్తిలో గండి బాబ్జీతో కలసి పర్యటించారు. ఈ ప్రయత్నాలను గంటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు వేర్వేరు బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహిస్తారని స్పష్టం కావడంతో కొణతాల, గండి బాబ్జీల చేరిక ప్రతిపాదన అప్పట్లో నిలిచిపోయింది. అయ్యన్న మాత్రం తన ప్రయత్నాలను చాపకింద నీరులా కొనసాగించి అనుకున్నది సాధించారు. గంటా వర్గం గరం గరం కొణతాల, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపడాన్ని గంటా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రి గంటా తన వర్గీయులతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. కొణతాల, గండి బాబ్జీల చేరికను అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ పరిణామాలపై రగిలిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా నిష్ర్కమించారు. నియోజకవర్గంలోని ఒకరిద్దరు ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లడిన అనంతరం ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పించడం ద్వారా పెందుర్తి టీడీపీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలు ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా కొణతాల చేరికకు సమ్మతించేది లేదని తేల్చి చెప్పారు. సమష్టిగా నిర్ణయం తీసుకుందామా... లేక తమ దారి తాము చూసుకోవాలా అని ఎమ్మెల్యేలు బండారు, పీలా మంత్రి గంటాను నిలదీసినట్లు సమాచారం. తమ అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసి ఫలితం లేకపోతే భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని గంటా వర్గం భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ విభేదాలు తాడోపేడో తేలిపోనుండటం ఖాయమని స్పష్టమవుతోంది. -
మా సిఫార్సులు పనికిరావా?
{పత్యేక ప్యాకేజీ పనుల ప్రతిపాదనకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు గైడ్‌లైన్స్ ప్రకారమే కేటాయించామన్న కలెక్టర్ పరిశీలించాలన్న మంత్రి అయ్యన్న విశాఖపట్నం: నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎలాగూ లేవు..వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మంజూరూ చేసే నిధుల విషయంలోనైనా తమను పట్టించు కోకపోతే ఎలా?వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం మంజూరు చేసిన రూ.100కోట్ల నిధులకు సంబంధించి ప్రతిపాదనల విషయంలోకూడా పరిగణనలోకి తీసుకోలేదంటూ జిల్లాయంత్రాంగంపై పలువురుఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్ట పంచాయితీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం మధ్యాహ్నం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక ఫ్యాకేజీ నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యేలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.23 కోట్ల మేరకు పనులను ప్రతిపాదించినటు ్టకలెక్టర్ యువరాజ్ వెల్లడించగా..తమనెందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్ఎన్ రాజు, పంచకర్ల రమేష్‌బాబు తదితరులు ప్రశ్నించారు. హుద్ హుద్ దెబ్బకు జిల్లాలో గ్రోయిన్స్, చెక్‌డామ్స్ పూర్తిగా దెబ్బతిన్నా యని, సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటన్నారని వారు వివరించారు. వాటి శాశ్వత పునరుద్ధరణ పనులకు ఈ నిధులను కేటాయించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అంచనాలు రూపొందించాలని మంత్రి అయ్యన్న నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంచనాలందగానే ప్రత్యేక ప్యాకేజీ నిధులతో ఈ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచ్చించాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనలకు లోబడి ఎమ్మెల్యేలు పనులు ప్రతిపాదించాలని సూచించారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, శారదానదితో పాటు పలు చోట్ల వంతెనల నిర్మాణానికిఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు. నియోజకవర్గానికి 10 పంచాయితీ భవనాలు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాలో వంద పంచాయితీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఒక్కో భవనం రూ.13లక్షల అంచనాతో నిర్మిస్తామన్నారు. భవనాల్లేని మరో 80 పంచాయితీలకు వచ్చే ఏడాది నిర్మించేందుకు ప్రతిపాదిస్తామన్నారు. నియోజక వర్గానికి 15 స్మశాన వాటికలను ఒక్కొక్కటి రూ.10లక్షల అంచనాతో ఆధునికీకరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న 670 అంగన్వాడీ భవనాలను కూడా ఉపాధి హామీలో చేపట్టాలని నిర్ణయించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని, ఎంపీ డాక్టర్ కె.హరిబాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ రాజు, కిడారి సర్వేశ్వరరావు, పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌ను ఆహ్వానించేందుకు సమయం కోరిన మంత్రులు
* వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసిన మంత్రిఅయ్యన్న * ప్రతిపక్ష నేతతో మాట్లాడి చెబుతానన్న ఎంపీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు.. మంత్రులు సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లు శుక్రవారం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. జగన్ ను మంత్రులు కలిసేందుకు సమయం కోరుతూ తొలుత అయ్యన్న వ్యక్తిగత సహాయకుడు ఒకరు ప్రతిపక్ష నేత వ్యక్తిగత సహాయకుడిని ఫోనులో సంప్రదించారు. గుంటూరు దీక్ష తరువాత వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకోవడానికే పరిమి తం అయ్యారని తెలియజేస్తూ.. వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడాల్సిందిగా ఆయన సూచించారు. దీంతో సాయంత్రం ఆరు గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు నేరుగా వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేశారు. తాను, కామినేని శ్రీనివాస్ కలిసి జగన్మోహన్రెడ్డి దగ్గరకు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే అంశంలో తమ పార్టీ వైఖరి గురువారమే స్పష్టం చేసినందున మళ్లీ ఆహ్వానం పలికేందుకు రావాల్సిన అవసరం ఏముందని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అయ్యన్న స్పందిస్తూ.. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించే బాధ్యత ముఖ్యమంత్రి తమకు అప్పగించారని, అందుకే రావాలనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం జగన్ విశ్రాంతి తీసుకుంటూ ఎవ రినీ కలవడం లేదని సుబ్బారెడ్డి బదులిచ్చారు. ఆ తర్వాత కూడా మంత్రులు సమయం కోరడంతో ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేసి, ఆ తర్వాత చెబుతాన ని ఎంపీ చెప్పారు. -
ఓడరేవులతోనే రాష్ట్రాభివృద్ధి!
మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు. పోర్టు, జెన్కోలో పర్యటన ముత్తుకూరు : ఓడరేవుల ఏర్పాటుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పురపాలకశాఖ మంత్రి నారాయణలు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 29 మంది ఎమ్మెల్సీలు, 23 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం జిల్లా పారిశ్రామికాభివృద్ధి అధ్యయనంలో భాగంగా కృష్ణపట్నం పోర్టులో పర్యటించారు. ఈ సందర్భంగా పోర్టు(సౌత్)లో జరిగిన సభలో మంత్రులు ప్రసంగించారు. సువిశాల తీరప్రాంతం ఉండటం వల్ల రాష్ట్రానికి ఓడరేవుల అవసరం ఉందన్నారు. దీని వల్ల పరిశ్రమలు వస్తాయని, రాష్ట్ర సంపద పెరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు సేకరించామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇదొక ఉదాహరణ అన్నారు. డిప్యూటీ స్పీకర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సర్వం కోల్పోయామని అనుకోవడం కంటే అభివృద్ధిపై అందరూ దృష్టిపెడితే మంచిదన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ఒకేప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్గో పెరిగితే బెర్తులు పెంచుతాం కృష్ణపట్నం పోర్టు ఎగుమతి, దిగుమతయ్యే సరుకుల పరి మాణం పెరిగితే బెర్తుల సంఖ్య పెంచుతామని పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి అన్నారు. లేకుంటే పోర్టు నష్టాలకు గురవుతుందన్నారు. కలకత్తా పోర్టు రూ. 300 కోట్లు, కొచ్చిన్ పోర్టు రూ. 150 కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంలు కాలుష్యం, సీఎస్ఆర్ నిధుల వ్యయంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానాలిచ్చారు. 250 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నామన్నారు. ఉప్పు నేలలు కావడం వల్ల మొక్కలు ఎదగడం లేదన్నారు. సోషల్ ఇన్ఫ్రాస్త్రక్చర్ అభివృద్ధి చెందితే విదేశీ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇందుకోసం తాము ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభలో విప్‌లు కాలువ శ్రీనివాసులు, అంగార శ్రీనివాసులు, యామనీబాల, పూన రవికుమార్, మేకా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ జానకి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టులో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలామ్ విగ్రహాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. జెన్కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టులో పర్యటించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందానికి ప్రాజెక్టు ఇంజనీర్లు ఘనంగా స్వాగతం పలికారు. సెక్యూరిటీ గార్డులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జెన్కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది, బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి, విద్యుత్ యూనిట్ ఎంతకు ఇస్తున్నారు, పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణాలు ఏమిటని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నలు కురిపించారు. దీనికి సీఈ సత్యనారాయణ బదులిస్తూ, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. కోల్ లింకేజీ ఒప్పందంలో జాప్యం జరిగిందన్నారు. మంగళవారం 2వ యూనిట్ సీఈఓ మొదలైందన్నారు. -
సమష్టి కృషితో గ్రామాభివృద్ధి
తుళ్లూరు : గ్రామాభివృద్ధికి అంతా సమష్టిగా కృషి చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. స్థానిక మేరీమాత హైస్కూల్ జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ కోడెల మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పారిశుద్ధ్య లేమి కారణంగా అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతివ్యక్తి ఏటా రూ.6,500 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 13వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ప్రతిపైసాను ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీలకు సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.ఐదువేల కోట్లు అభివృద్ధికి వెచ్చించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,831 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ రిపోర్డు ఆధారంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేతనాల పెంపు జరుగుతుందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 138 పంచాయతీలకు ప్రోత్సాహక నగదు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి శ్రీధర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. -
పార్టీలతో ప్రమేయం లేకుండా అభివృద్ధి: మంత్రి అయ్యన్న
నర్సీపట్నం : పార్టీలతో ప్రమేయం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో ఆదివారం మూడు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం తనకు సహకరించారని, వారి రుణం తీర్చుకునేలా పార్టీ ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. గత ఎన్నికల్లో తాను సాధించిన విజయంలో పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్థుల ప్రమేయముందని, కష్ట సమయంలో వెన్నంటి ఉన్నవారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో తనకు సహకరించిన వారికి సైతం అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. రాష్ర్టంలో ఎక్కడాలేని విధంగా తన నియోజకవర్గానికి రూ. 40 కోట్ల మేర నిధుల్ని కేటాయించినట్టు ఆయన వివరించారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేందుకు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కొన్ని మండలాల్లో పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేలా వ్యవహరిస్తున్నారని, అవసరం లేని చోట పనులు చేపట్టి నిధుల వృధాకు పాల్పడుతున్నారని, ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి నియోజక అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవుపలికారు. తనకు ఎన్నికల్లో సహకరించిన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, పార్టీ గొలుగొండ, మాకవరపాలెం మండలాల అధ్యక్షులుగా అడిగర్ల అప్పలనాయుడు, రుత్తల శేషుకుమార్లను నియమించారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు సీహెచ్ వివేకానంద, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామునాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీలో ఎమ్మెల్సీ కాక
{పయత్నాలకు తెరతీసిన ఆశావాహులు తమవర్గీయుడికోసం అయ్యన్న, గంటా వ్యూహాలు అధిష్టానం కటాక్షం పైనే తటస్థుల ఆశలు ఆసక్తికరంగా టీడీపీ వర్గ రాజకీయాలు విశాఖపట్నం: అగ్నికి ఆజ్యం తోడవటమంటే ఇదేనేమో!... మంత్రులు అయ్యన్న, గంటా వర్గాల మ ద్య భగ్గుమంటున్న విభేదాలను మరింత రాజేసేలా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంలో టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందనీ... అదీ జిల్లా నేతకే అవకాశాలు ఎక్కువని అంచనా వేస్తున్నారు. దాంతో తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు. దూకుడు మీదున్న అయ్యన్నవర్గం - ప్రతిపాదించేది ఎవరి పేరో! ఎమ్మెల్సీ పదవి తమ వర్గీయుడికే దక్కేలా చేయాలని మంత్రి అయ్యన్న వర్గం గట్టి పట్టుదలగా ఉంది. గంటా వర్గంతో కొనసాగుతున్న ఆధిపత్య పోరులో పెచైయ్యి సాధించడానికి ఇదే మార్గమని నమ్ముతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ముందు పెట్టి గంటా వర్గాన్ని ఢీకొంటోంది అందుకేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తననే ప్రతిపాదిస్తారని ఆయన కూడా అయ్యన్నపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ అయ్యన్న లోతుగుండె రాజకీయాలు తెలిసినవారు మాత్రం ఆయన వ్యూహాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. విభేదాలకు కేంద్ర బిందువైన గవిరెడ్డికి అవకాశాలు సన్నగిల్లితే ప్రత్యమ్నాయంగా తమ వర్గం నుంచే మరొకరికి ప్రతిపాదించొచ్చు కూడా. ఎన్నికల ముందు అయ్యన్న టీడీపీలోకి తీసుకువచ్చిన తోట నగేష్ పేరు వినిపిస్తోంది. ఇక ‘కొత్త ముఖాన్ని’ తెరపైకి తెచ్చేందుకు కూడా అయ్యన్న యోచిస్తున్నారన్న సమాచారం టీడీపీలో కాక పుట్టిస్తోంది. తటస్థుల జోరు : ఇరువర్గాలతో నిమిత్తం లేకుండా ప్రయత్నామలు ముమ్మరం చేస్తేనే ఫలితం ఉంటుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎస్.ఎ. రహమాన్, మణికుమారి తదితరులు ఉన్నారు. సీనియార్టీతోపాటు సామాజికవర్గ ప్రాతిపదికన పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా స్థానిక కాపు సామాజికవర్గానికి చెందిన వారికి జిల్లాలో అవకాశం దక్కలేదన్న వాదనను ఆయన తెరపైకి తెస్తున్నారు. మైనార్టీ కోటాలో ఎస్.ఎ.రహమాన్ ఎమ్మెల్సీ పీఠానికి గురిపెట్టారు. ఎస్టీ కోటాలో మణికుమారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు వంటి నేతలు కూడా తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అనూహ్యంగా కొత్త ముఖాలకు సీఎం చంద్రబాబు మొగ్గుచూపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం ఎమ్మెల్సీ పదవే లక్ష్యంగా టీడీపీ రాజకీయాలు ఊపందుకోనున్నాయి. గుంభనంగా గంటా వర్గం ఎమ్మెల్సీ పదవి విషయంలో మంత్రి గంటా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము నేరుగా ఎవరి పేరును ప్రతిపాదించకుండా అయ్య న్న వర్గం సూచించే నేతను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి క్షణంలో తమవర్గీయుడి పేరును తెరపైకి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశాలున్నాయి. -
ఉపాధి నిధులకు నర్సీ పట్టం
అయ్యన్న ‘మంత్రా’ంగంతో రూ.21.24కోట్లు కేటాయింపు ఇతర ‘దేశం’ ఎమ్మెల్యేలకు రూ.4 కోట్ల లోపే మరమ్మతుల పేరిట స్వాహాకు తమ్ముళ్ల యత్నం వైఎస్సార్సీపీ సెగ్మెంట్ల పట్ల వివక్ష నోరుంటే చాలు.. ఊళ్లు దోచుకోవచ్చు అన్న రీతిలో ఉంది అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల తీరు. ఉపాధిహామీ నిధుల పంపకం ఇందుకు నిదర్శనం. అధికారులపై ఒత్తిడి తెచ్చి రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్న పాత్రుడు తాను ప్రాతినిధ్యం వహించే నర్సీపట్నం నియోజక వర్గానికి సగం నిధులు రాబట్టుకున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు అరకొరగా కేటాయించి కొత్తసంస్కృతికి నాంది పలికారు. ‘మంత్రా’ంగం జరిగిపోవడంతో పనులు దక్కించుకుని ఆ నిధులను దోచుకు తినేందుకు తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. విశాఖపట్నం: ఉపాధి హామీ పథకంలో జిల్లాకు 321 పంచాయతీ, 39 స్త్రీ శక్తి భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలు తుదిదశకు చేరేసరికి నిధుల సమస్య తలెత్తింది. అదనపు నిధులు కోరగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డబ్ల్యూబీఎం రహదారుల నిర్మాణంతో పాటు చెక్‌డామ్‌ల మరమ్మతులకు కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఇలా జిల్లాకు ఏ కంగా రూ.40.2 కోట్లు విడుదలయ్యాయి. మరమ్మతుల పేరిట 223 పంచాయతీ భవనాలకు రూ.6కోట్ల 87లక్షల 86వేలు, 20 స్త్రీ శక్తి భవనాలకు కోటి 6లక్షల 60 వేలు, 375 చెక్‌డామ్‌లకు రూ.9కోట్ల 45లక్షల 89వేలు మంజూరు చేశారు. కొత్తగా గ్రామాల్లో 344 అంతర్గత సీసీరోడ్ల కోసం రూ.16కోట్ల 31 లక్షల 50 వేలు, మండల కేంద్రాలకు 29 డబ్ల్యూబీఎం రహదారుల కోసం రూ.ఆరు కోట్ల 52లక్షల 50 వేల చొప్పున మంజూరు చేశారు. సాధారణంగా ఈ నిధులను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సమానంగా ఖర్చు చేయాలి. కానీ నోరున్నవాడిదే రాజ్యం అన్నట్టుగా రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్న పాత్రుడు అడిగింతే తడవుగా ఆయన ప్రాతినిధ్యం వహించే నర్సీపట్నం నియోజక వర్గానికి ఈ నిధుల్లో సగానికి పైగా అంటే ఏకంగా రూ.21కోట్ల 24లక్షల 15వేలు అధికారులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే మరే ఇతర నియోజక వర్గాలకు ఈస్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. నర్సీపట్నం తర్వాత మిగిలిన తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు రూ.18.96 కోట్లు మాత్రమే కేటాయించారు. పాడేరు, అరకు, మాడుగుల నియోజకవర్గాలకు రూ.4కోట్లు, మిగిలిన ఆరింటికి 15.86కోట్లు కేటాయించారు. మంత్రి గారి నియోజకవర్గంలో... నర్సీపట్నంలో మరమ్మతుల పేరిట 64 పంచాయతీ భవనాలకు రూ.2కోట్ల 80లక్షల 15వేలు, మూడుస్త్రీశక్తి భవనాలకు రూ.12.45లక్షలు, 78 చెక్‌డామ్‌లకు కోటి 59లక్షల 15వేలు కేటాయించారు. ఇక అత్యధికంగా 152 సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఏకంగా 10కోట్ల 23లక్షల 50వేలు, అలాగే 28డబ్ల్యూబీఎం రహదారుల కోసం ఆరుకోట్ల 48లక్షల 90వేలతో ప్రతిపాదించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి మాత్రమే అత్యధికంగా రూ.4కోట్ల 29లక్షల 95 వేలు దక్కగా, యలమంచలికి రూ.3కోట్ల 90లక్షల 56వేలు, చోడవరానికి రూ.2కోట్ల 61లక్షల 81 వేలు,పెందుర్తికి రూ.2కోట్ల 11లక్షల 72వేలు, భీమిలికి రూ.కోటి 78లక్షల 52వేలు కేటాయిం చగా,అత్యల్పంగా అనకాపల్లి నియోజకవర్గానికి కేవలం రూ.5.2 లక్షలు మాత్రమే దక్కాయి. మరొక పక్క ఈ పనులను అడ్డంపెట్టుకుని ఉపాధి నిధులను దోచుకుతినేందుకు అధికార పార్టీనేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను పూర్తిగా తమ కార్యకర్తలతోనే చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతిపక్షం పట్ల మళ్లీ వివక్షత ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలైన పాడేరుకు కోటి ఆరులక్షలు, అరకుకు కోటి 38లక్షలు, మాడుగలకు కోటి 74 లక్షలు కేటాయించారు. అవికూడా తప్పనిసరిపరిస్థితుల్లో ఏజెన్సీలో ఎక్కువగా ఉండే చెక్‌డామ్‌ల మరమ్మతులకు కేటాయించారు. మాడుగులకు మినహా మిగిలిన అరకు,పాడేరు నియోజకవర్గాలకు పంచాయతీ, స్త్రీ శక్తి భవనాల మరమ్మతులకు రూపాయికూడా కేటాయించలేదు. అరకు, పాడేరులలో ఒక్క సీసీ రోడ్డుకుకూడా నిధులివ్వలేదు. మాడుగులకు మాత్రం 31 సీసీరోడ్లకు రూ.70లక్షలు, ఒక డబ్ల్యూ బీఎం రోడ్‌కు రూ.3.6లక్షలు కేటాయించారు. ప్రభుత్వపెద్దల ఒత్తిడిమేరకే ఈనియోజకవర్గాలకు అరకొరగా కేటాయింపులు జరుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.