* వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసిన మంత్రిఅయ్యన్న
* ప్రతిపక్ష నేతతో మాట్లాడి చెబుతానన్న ఎంపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు.. మంత్రులు సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లు శుక్రవారం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. జగన్ ను మంత్రులు కలిసేందుకు సమయం కోరుతూ తొలుత అయ్యన్న వ్యక్తిగత సహాయకుడు ఒకరు ప్రతిపక్ష నేత వ్యక్తిగత సహాయకుడిని ఫోనులో సంప్రదించారు.
గుంటూరు దీక్ష తరువాత వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకోవడానికే పరిమి తం అయ్యారని తెలియజేస్తూ.. వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడాల్సిందిగా ఆయన సూచించారు. దీంతో సాయంత్రం ఆరు గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు నేరుగా వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేశారు. తాను, కామినేని శ్రీనివాస్ కలిసి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే అంశంలో తమ పార్టీ వైఖరి గురువారమే స్పష్టం చేసినందున మళ్లీ ఆహ్వానం పలికేందుకు రావాల్సిన అవసరం ఏముందని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
అయ్యన్న స్పందిస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించే బాధ్యత ముఖ్యమంత్రి తమకు అప్పగించారని, అందుకే రావాలనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం జగన్ విశ్రాంతి తీసుకుంటూ ఎవ రినీ కలవడం లేదని సుబ్బారెడ్డి బదులిచ్చారు. ఆ తర్వాత కూడా మంత్రులు సమయం కోరడంతో ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేసి, ఆ తర్వాత చెబుతాన ని ఎంపీ చెప్పారు.
జగన్‌ను ఆహ్వానించేందుకు సమయం కోరిన మంత్రులు
Published Sat, Oct 17 2015 1:35 AM | Last Updated on Thu, Aug 9 2018 4:30 PM
Advertisement