ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి 200 ఎకరాలు
అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) పరిధిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి 200 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్‌ఆర్‌ఎంకు భూములు ఇచ్చే విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా... ఎస్‌ఆర్‌ఎంకు భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, ఈ నేపథ్యంలో భూమి కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తొలిదశలో 100 ఎకరాలు కేటాయిస్తామని, 17,500 మంది విద్యార్థులకు ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. తొలిదశలో ఇచ్చిన 100 ఎకరాలకు సంబంధించి నిర్దేశించిన ఫలితాలను సాధిస్తే రెండో దశలో 100 ఎకరాలను కేటాయిస్తామన్నారు. ఎకరా రూ.50 లక్షలకు ధర కేటాయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.