allotted
-
ప్రియాంక గాంధీకు కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో గది కేటాయింపు
-
ఎస్ఆర్ఎం వర్సిటీకి 200 ఎకరాలు
అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి 200 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చే విషయమై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా... ఎస్ఆర్ఎంకు భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, ఈ నేపథ్యంలో భూమి కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశలో 100 ఎకరాలు కేటాయిస్తామని, 17,500 మంది విద్యార్థులకు ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. తొలిదశలో ఇచ్చిన 100 ఎకరాలకు సంబంధించి నిర్దేశించిన ఫలితాలను సాధిస్తే రెండో దశలో 100 ఎకరాలను కేటాయిస్తామన్నారు. ఎకరా రూ.50 లక్షలకు ధర కేటాయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. -
బోనాలకి రూ.10కోట్లు మంజూరు
-
మెనార్టీస్ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.37 కోట్ల నిధులు కేటాయించినట్లు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.70.39 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.67.08 లక్షలు తమ బడ్జెట్లో కేటాయించాయన్నారు. ఈ నిధులతో కమిషన్ కార్యకలాపాల నిర్వహణకు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. త్వరలో కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిల్లో మైనార్టీ సమస్యలపై సెమినార్లు, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒకరి చొప్పున సమన్వయకర్తల నియామకం చేపట్టనున్నట్లు చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ వివరించారు.