మెనార్టీస్ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు | 1.37crores allotted for minority commission | Sakshi
Sakshi News home page

మెనార్టీస్ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు

Published Fri, Apr 17 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

1.37crores allotted for minority commission

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.37 కోట్ల నిధులు కేటాయించినట్లు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.70.39 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.67.08 లక్షలు తమ బడ్జెట్‌లో కేటాయించాయన్నారు. ఈ నిధులతో కమిషన్ కార్యకలాపాల నిర్వహణకు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు.

త్వరలో కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిల్లో మైనార్టీ సమస్యలపై సెమినార్లు, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒకరి చొప్పున సమన్వయకర్తల నియామకం చేపట్టనున్నట్లు చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement