
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.