kamruddin
-
మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఆంధ్ర కోల్ట్స్ విజయం
హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర కోల్ట్స్ జట్టుకు తొలి విజయం లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 118 పరుగుల భారీ తేడాతో గోవాను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర కోల్ట్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (63 బంతుల్లో 68; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీబీ రవితేజ (73 బంతుల్లో 55; 3 ఫోర్లు), కె.మహీప్ కుమార్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గోవా 49.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. దర్శన్ మిసాల్ (48) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర తరఫున ఎస్కే కమ్రుద్దీన్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... సురేందర్ కుమార్, ఎస్‌హెచ్ శ్రీనివాస్ చెరో 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌లలో విదర్భపై 4 వికెట్లతో ‘కాగ్’... కేరళపై 95 పరుగులతో బరోడా... కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్‌పై 9 వికెట్లతో ఎయిరిండియా జట్లు విజయం సాధించాయి. -
నకిలీ పాసుపోర్టు ముఠా గుట్టురట్టు
నకిలీ పాసుపోర్టులను తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు కోరుట్ల పోలీసులు. వారి నుంచి భారీగా నకిలీ పాసుపోర్టులు, నకిలీ విద్యార్హత, జనన, నివాస దృవీకరణ పత్రాలతో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కోరుట్లకు చెందిన కమ్రుద్దీన్, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సత్తార్‌లను అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిల్ నిందితుల వివరాలు వెల్లడించారు.