ఆంధ్ర కోల్ట్స్‌ విజయం | The victory of Andhra Colts | Sakshi
Sakshi News home page

ఆంధ్ర కోల్ట్స్‌ విజయం

Published Thu, Aug 24 2017 12:41 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

The victory of Andhra Colts

హైదరాబాద్‌:  ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర కోల్ట్స్‌ జట్టుకు తొలి విజయం లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 118 పరుగుల భారీ తేడాతో గోవాను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర కోల్ట్స్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (63 బంతుల్లో 68; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీబీ రవితేజ (73 బంతుల్లో 55; 3 ఫోర్లు), కె.మహీప్‌ కుమార్‌ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.

అనంతరం గోవా 49.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. దర్శన్‌ మిసాల్‌ (48) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర తరఫున ఎస్‌కే కమ్రుద్దీన్‌ 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... సురేందర్‌ కుమార్, ఎస్‌హెచ్‌ శ్రీనివాస్‌ చెరో 2 వికెట్లు తీశారు.  ఇతర మ్యాచ్‌లలో విదర్భపై 4 వికెట్లతో ‘కాగ్‌’... కేరళపై 95 పరుగులతో బరోడా... కంబైన్డ్‌ డిస్ట్రిక్ట్స్‌ ఎలెవన్‌పై 9 వికెట్లతో ఎయిరిండియా జట్లు విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement