సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మైనార్టీల సమగ్రాభివృద్ధి, ఆయా రంగాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మహ్మద్ ఖమురుద్దీన్ నేతృత్వంలో 2018లో ప్రభుత్వం మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో మైనార్టీలు తమకు జరగాల్సిన న్యాయం కోసం కమిషన్‌ను సంప్రదిస్తున్నారు. చైర్మన్‌గా ప్రతినెలా క్రమం తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తూ, విచారణలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ ఖమురుద్దీన్ ‘సాక్షి’కి వివరించారు.
ఇప్పటివరకు 966 కేసులు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్ సంస్థలపై నమోదు అయ్యాయని, ఇందులో 802 కేసులు పరిష్కరించిన్నట్లు తెలిపారు. రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు కమిషన్ కృషి చేసింది. అంబేద్కర్ వర్సిటీలో ఉర్దూ భాషలో గ్రాడ్యుయేషన్ కోర్సులను అమలుచేసేలా చర్యలు తీసుకుంది. ప్రెస్ అకాడమీ లోగోలో ఉర్దూ భాషను చేర్పడం మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 4 శాతం రిజర్వేషన్ అమలుపై దృష్టి సారించి, ఆయా శాఖల్లో మైనార్టీలకు కేటాయించిన ఖాళీ పోస్టుల వివరాలు తెలుసుకొని వాటిని భర్తీకి చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment